
టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్ టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు లంక పర్యటనకు వెళ్లింది. భారత టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. వన్డేలకు రోహిత్ శర్మ సారథిగా కొనసాగనున్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మరి ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్, జట్లు తదితర వివరాలు గమనిద్దాం.
టీ20 సిరీస్- మూడు మ్యాచ్‌లు
🏏తొలి టీ20- జూలై 27, శనివారం
🏏రెండో టీ20- జూలై 28- ఆదివారం
🏏మూడో టీ20- జూలై 30- మంగళవారం
👉ఈ మూడు మ్యాచ్‌లకు వేదిక: పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం, పల్లెకెలె
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం.. రాత్రి ఏడు గంటల నుంచి టీ20 మ్యాచ్‌లు ఆరంభం
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
👉సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
ఆతిథ్య శ్రీలంక జట్టు
👉చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరానా, నువాన్ తుషార, అసిత ఫెర్నాండో, బినురా ఫెర్నాండో.
వన్డే సిరీస్- మూడు మ్యాచ్‌లు
🏏తొలి వన్డే- ఆగష్టు 2- శుక్రవారం
🏏రెండో వన్డే- ఆగష్టు 4- ఆదివారం
🏏మూడో వన్డే- ఆగష్టు 7- బుధవారం
👉శ్రీలంక- టీమిండియా మధ్య వన్డే మ్యాచ్‌ల వేదిక: ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు మొదలు.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
👉రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్( వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. కాగా భారత్‌తో వన్డే సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించాల్సి ఉంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో శ్రీలంక- టీమిండియా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
👉డిజిటల్: సోనీలివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్.
Comments
Please login to add a commentAdd a comment