
కొలంబో వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. . 231 పరుగుల ఛేదనలో శ్రీలంక బౌలర్లను రోహిత్ ఉతికారేశాడు. హిట్‌మ్యాన్ తన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా శ్రీలంక అరంగేట్ర ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను రోహిత్ శర్మ టార్గెట్ చేశాడు.
4 ఓవర్ వేసిన షిరాజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 15 పరుగులు రాబట్టాడు. అందులో ఓ సింగిల్ ఉంది. రోహిత్ దెబ్బకు సిరాజ్‌ను మరి బౌలింగ్ ఎటాక్‌లోకి లంక కెప్టెన్ తీసుకురాలేదు.
ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే.
Rohit Sharma retired from T20Is and now he has started treating ODIs like T20Is. 🙇🏻♂️🔥#RohitSharma𓃵 | #INDvsSL pic.twitter.com/W5Ek39y0DO
— 𝐒𝐚𝐧𝐠𝐫𝐚𝐦 ⚚ (@shinewid_SAM) August 2, 2024
Comments
Please login to add a commentAdd a comment