అంతర్జాతయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి ప్రస్తానం అందరు క్రికెటర్లలానే ఒడిదుడుకుల మధ్య సాగింది. కెరీర్ ఆరంభంలో సాధారణ ఆటగాడిగా కనిపించిన కోహ్లి, తన ఫిట్‌నెస్ స్థాయిని పెంచుకుని అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఆతర్వాత దశాబ్ద కాలం పాటు ప్రపంచ క్రికెట్‌కు మకుటం లేని మారాజుగా కొనసాగాడు. అయితే, అందరు దిగ్గజ క్రికెటర్లలానే కోహ్లి కూడా కెరీర్ మధ్యలో బ్యాడ్ టైమ్ వచ్చింది.
THAT JUMP 🦁pic.twitter.com/XTWLDTY8V4
— CricTracker (@Cricketracker) September 11, 2023
దాదాపు మూడేళ్ల పాటు సెంచరీ ఊసే లేకుండా, అనర్హుల చేతుల్లో సైతం మాటలు పడ్డాడు. ఈ మధ్యలో పలు వివాదాలు, కెప్టెన్సీ కోల్పోవడం వంటివి జరిగాయి. అయినా కోహ్లి ఎంత మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మొండిగా ముందుకు సాగాడు. 2019-2022 వరకు తన వెంటాడిన బ్యాడ్‌టైమ్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 2022 ఆసియా కప్‌లో (టీ20 ఫార్మాట్) ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీతో కోహ్లి తిరిగి తన ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు.
కోహ్లికి ఇది అంతర్జాతీయ టీ20ల్లో మొదటి శతకం. ఇక ఇక్కడి నుంచి కోహ్లి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసపెట్టి సెంచరీల మోత మోగించాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ తర్వాత అదే ఏడాది బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్ వన్డేలో సెంచరీ, ఈ ఏడాది (2023) స్వదేశంలో శ్రీలంకపై వన్డేల్లో రెండు సెంచరీలు, ఆతర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టెస్ట్ శతకం, దాని తర్వాత విండీస్ పర్యటనలో మరో టెస్ట్ శతకం, తాజాగా పాక్‌పై ఆసియా కప్‌లో రికార్డు శతకం.. ఇలా వరుస పెటి సెంచరీ చేస్తూ కోహ్లి మళ్లీ మనుపటిలా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. పాక్‌పై తాజా శతకంతో కోహ్లి సాధించిన పలు రికార్డులు..
- అంతర్జాతీయ క్రికెట్‌లో 77వ శతకం
- అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడు
- వన్డేల్లో అత్యంత వేగంగా 47 సెంచరీలు (267 ఇన్నింగ్స్‌ల్లో) చేసిన ఆటగాడు
- కొలొంబోలో వరుసగా నాలుగో సెంచరీ
ఇలా కోహ్లి పాక్‌పై సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుని రికార్డుల రారాజు అన్న బిరుదుకు న్యాయం చేశాడు. వాస్తవానికి కోహ్లి తన గడ్డుకాలంలో కూడా ఫామ్‌లో లేడనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో అతను సెంచరీ మాత్రమే చేయలేకపోయాడు. పలు అర్ధసెంచరీల సాయంతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
కొసమెరుపు ఏంటంటే పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ సైతం సెంచరీ చేసినప్పటికీ కోహ్లి రికార్డుల కింద అది మరుగున పడిపోయింది. రాహుల్ సైతం దాదాపు ఆరు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చి, వచ్చీ రాగానే తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు. కోహ్లి (122 నాటౌట్), రాహుల్ (111 నాటౌట్)లతో పాటు రోహిత్ (56), శుభ్‌మన్ గిల్ (58) అర్ధసెంచరీలతో రాణించడంతో పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment