Rohit Sharma Comments On Rishabh Pant: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం అతడి నైజమన్న హిట్‌మ్యాన్.. పంత్ లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందన్నాడు. కాగా గతేడాది డిసెంబరులో ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
పంత్ నడుపుతున్న కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా ధ్వంసమైపోగా.. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి రిషభ్ పంత్‌ను ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేయించి ప్రత్యేక చికిత్స అందించింది.
ఎన్‌సీఏలో రిషభ్ పంత్
ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కోలుకున్న ఈ యువ వికెట్ కీపర్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. నిపుణుల పర్యవేక్షణలో జిమ్‌లో కసరత్తులు చేయడంతో పాటు.. బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేసే పనిలో పడ్డాడు.
ఇదిలా ఉంటే.. యాక్సిడెంట్ కారణంగా.. సుదీర్ఘకాలంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్ సహా ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ఈవెంట్లలో భాగం కాలేకపోతున్నాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి అందుబాటులోకి!
వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రిషభ్ పంత్ మళ్లీ మైదానంలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తాజాగా స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పంత్‌లాంటి అగ్రెసివ్ బ్యాటర్ ఉండాలి
‘‘రిషభ్ పంత్ తనదైన శైలిలోనే ముందుకు సాగాలి. రిస్క్ అయినా వెనుకాడడు.. అతడు దూకుడుగానే ఆడతాడు. అలాగే ఆడాలి కూడా! మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తను అలా బ్యాటింగ్ చేస్తానని పంత్ తరచూ చెబుతూ ఉంటాడు. చెప్పినట్లుగానే తను అనుకున్న ఫలితాలను రాబట్టగల సత్తా అతడకి ఉంది.
తొలి బంతి నుంచే బౌలర్‌పై ఒత్తిడి పెంచగల పంత్ లాంటి వ్యక్తి జట్టుకు ఎంతో అవసరం’’ అని రోహిత్ శర్మ.. పంత్ ఆట తీరును కొనియాడాడు. కాగా 2024 జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ఆరంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
చదవండి: రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్!
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. ఇకపై గంభీర్..
Comments
Please login to add a commentAdd a comment