Asia Cup 2023 Final IND VS SL: చరిత్ర సృష్టించిన సిరాజ్‌ | Asia Cup 2023 Final IND VS SL: Mohammed Siraj Registers Fastest Ever 5 Wicket Haul For India | Sakshi
Sakshi News home page

Asia Cup 2023 Final IND VS SL: చరిత్ర సృష్టించిన సిరాజ్‌

Published Sun, Sep 17 2023 5:07 PM | Last Updated on Sun, Sep 17 2023 5:38 PM

Asia Cup 2023 Final IND VS SL: Mohammed Siraj Registers Fastest Ever 5 Wicket Haul For India - Sakshi

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య కొలొంబో వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఏస్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో పాటు 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున సింగిల్‌ స్పెల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

చమిందా వాస్‌ రికార్డు సమం..
ఓవరాల్‌గా చూస్తే.. సిరాజ్‌ లంక పేస్‌ దిగ్గజం చమిందా వాస్‌ రికార్డును సమం చేశాడు. వాస్‌ కూడా సిరాజ్‌ లాగే ఓ స్పెల్‌లో 16 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ తన స్పెల్‌లో తొలి 16 బంతుల్లో (2.4 ఓవర్లలో) ఓ మెయిడిన్‌ ఓవర్‌ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

సిరాజ్‌ ఆన్‌ ఫైర్‌.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక
ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరుగుతున్నాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకేయులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్‌.. ఓ మెయిడిన్‌ ఓవర్‌ వేసి  13 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.

నిస్సంక (2, జడేజా క్యాచ్‌), కుశాల్‌ మెండిస్‌ (17, బౌల్డ్‌), సమరవిక్రమ (0, బౌల్డ్‌), అసలంక (0, ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌), ధనంజయ డిసిల్వ (4, రాహుల్‌ క్యాచ్‌), షనక (0, బౌల్డ్‌) వికెట్లు సిరాజ్‌ ఖాతాలో పడ్డాయి. కుశాల్‌ పెరీరాను (0) బుమ్రా.. వెల్లలగేను (8) హార్దిక్‌ ఔట్‌ చేశారు. 13 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 40/8గా ఉంది. ప్రమోద్‌ మధుషన్‌ (0), దుషన్‌ హేమంత (6) క్రీజ్‌లో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement