Chaminda Vaas
-
Asia Cup 2023 Final IND VS SL: చరిత్ర సృష్టించిన సిరాజ్
భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలొంబో వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 4 వికెట్లతో పాటు 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున సింగిల్ స్పెల్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. The historical over of Mohammad Siraj.....!!! 4 wickets in a single over. pic.twitter.com/aMd3cihLso — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 చమిందా వాస్ రికార్డు సమం.. ఓవరాల్‌గా చూస్తే.. సిరాజ్ లంక పేస్ దిగ్గజం చమిందా వాస్ రికార్డును సమం చేశాడు. వాస్ కూడా సిరాజ్ లాగే ఓ స్పెల్‌లో 16 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తన స్పెల్‌లో తొలి 16 బంతుల్లో (2.4 ఓవర్లలో) ఓ మెయిడిన్ ఓవర్ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. Mohammad Siraj registers the fastest ever 5 wicket haul in a spell for India in international cricket - 16 balls. pic.twitter.com/ilfFa1pZ4u — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్.. ఓ మెయిడిన్ ఓవర్ వేసి 13 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. Mohammad Siraj - the hero! A superb delivery to get his 6th wicket. pic.twitter.com/U3mDt9u9WG — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 నిస్సంక (2, జడేజా క్యాచ్), కుశాల్ మెండిస్ (17, బౌల్డ్), సమరవిక్రమ (0, బౌల్డ్), అసలంక (0, ఇషాన్ కిషన్ క్యాచ్), ధనంజయ డిసిల్వ (4, రాహుల్ క్యాచ్), షనక (0, బౌల్డ్) వికెట్లు సిరాజ్ ఖాతాలో పడ్డాయి. కుశాల్ పెరీరాను (0) బుమ్రా.. వెల్లలగేను (8) హార్దిక్ ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 40/8గా ఉంది. ప్రమోద్ మధుషన్ (0), దుషన్ హేమంత (6) క్రీజ్‌లో ఉన్నారు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్ కరెక్ట్ అన్న లంక మరో పేసర్!
IPL 2023- Matheesa Pathirana- CSK: మతీశ పతిరణ.. ‘బేబీ మలింగ’గా పేరొందిన ఈ శ్రీలంక బౌలర్.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడనడంలో సందేహం లేదు. తన వైవిధ్యమైన టెక్నిక్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టే 20 ఏళ్ల పతిరణ.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జట్టుకు అవసరమైన సమయంలో డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలు ఇచ్చిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పతిరణను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలను.. లంక మాజీ స్టార్ లసిత్ మలింగ ఖండించగా.. మరో లంక పేసర్ చమిందా వాస్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టెస్టులు ఆడొద్దు బేబీ మలింగ గురించి ధోని మాట్లాడుతూ.. పతిరణ పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావాలని.. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. వన్డేలు, టీ20లకు మాత్రమే లంక అతడి సేవలను ఉపయోగించుకోవాలని సూచన చేశాడు. గాయాల బారిన పడితే కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ధోని వ్యాఖ్యలు ఖండించిన మలింగ అయితే, మలింగ మాత్రం ఈ విషయంలో ధోనిని వ్యతిరేకించాడు. గాయాలకు భయపడి టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. సంప్రదాయ క్రికెట్ ఆడితేనే టెక్నిక్ మెరుగుపడుతుందని పేర్కొన్నాడు. తాను కూడా టెస్టులు ఆడిన వాడినేనని.. ధోని గనుక సీరియస్‌గానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అవి ఆమోదనీయం కాదంటూ ఖండించాడు. కానీ, చమింద వాస్ మాత్రం ధోని వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. ‘‘పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అతడి లాంటి వైవిధ్యమైన, ప్రత్యేకమైన యాక్షన్ కలిగిన బౌలర్ ఒకవేళ అన్ని ఫార్మాట్లలో ఆడితే ఫిట్నెస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే పెద్దగా భారం పడదు. అంతకంటే ఎక్కువసేపు రోజుల తరబడి బౌల్ చేయాలంటే సమస్యలు తప్పవు. ధోని మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్ లేకుండానే..! -
దడదడలాడించిన చమిందా వాస్
ఇప్పుడు మనమంతా టి20 మెరుపుల్ని తెగ చూసేస్తున్నాం. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ హిట్లు... షాట్లపైనే మన కళ్లుంటాయి. ఏ ఓవరైనా సిక్స్‌లు, ఫోర్లతో నిండిపోతే దాని గురించి కాసేపైనా చర్చించుకుంటాం. కానీ బౌలింగే ఎప్పుడూ ఎడారై పోతుంటుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో బౌలరెప్పుడూ బలిపశువుగానే కనబడతాడు. కానీ 19 ఏళ్ల క్రితం ఓ పేసర్ తన బౌలింగ్‌తో ఏకంగా ఓ జట్టునే బలిచేశాడు. 100 ఓవర్లు జరగాల్సిన వన్డే మ్యాచ్‌ను 20 ఓవర్లలోనే ముగించాడు. ఈ సంచలన ధీరుడు లంక సీమర్ చమిందా వాస్ కాగా... బలైంది జింబాబ్వే! కపిల్‌దేవ్ 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఆడిన 175 పరుగుల ప్రదర్శనను ఎవరైనా మర్చిపోతారా? వన్డేల్లో సచిన్ క్రికెట్ పుటలకెక్కించిన ద్విశతకం గుర్తుండనిది ఎవరికి? టెస్టుల్లో ముల్తాన్ సుల్తాన్ అయిన సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ ఎన్నేళ్లయినా మన బుర్రల్లోంచి డిలీట్ అవుతుందా? కచ్చితంగా కావు కదా! ఇవన్నీ అసాధారణమైనవి. కానీ బ్యాట్‌తోనే చిరకాలం గుర్తుండిపోయేవి. మరీ బౌలింగ్‌లో లేవా అంటే ఉన్నాయి. టెస్టు చరిత్రలో మన అనిల్ కుంబ్లే పదికి పది వికెట్లు. మరి వన్డేల్లో ఈ దారిలోకొచ్చిన సీమర్ ఉన్నాడు. అతడే శ్రీలంక బౌలర్ చమిందా వాస్. అతని పేస్ పదునుకు పదికి పది తీయకపోయినా... అంతపనీ చేసేశాడు. మురళీధరన్ ఆఖరి రెండు వికెట్లను వరుస బంతుల్లో తీయకపోయుంటే వన్డేల్లో వాస్ మరో కుంబ్లే అయ్యేవాడు. అయినప్పటికీ ఎవరూ అందుకోలేని రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు వాస్ పేరిటే ఉంది. బ్రేక్ లేకుండా... జింబాబ్వేతో 2001 డిసెంబర్లో ఈ మ్యాచ్ జరిగే సమయంలో శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు వేడెక్కి ఉన్నాయి. ఎన్నికలు, ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ పంజా నేపథ్యంలో పోలీసులు కొలంబోలో దాదాపు కర్ఫ్యూ విధించే పరిస్థితి నెలకొంది. అయితే పొద్దంతా సాగే మ్యాచ్‌ను వాస్ తన పేస్‌తో ఓ పూటకే ముగించడంతో పోలీసులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగినా... ఖాతా తెరిచింది మాత్రం వాస్. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే ఇబ్రహీమ్ ఎల్బీగా డకౌటయ్యాడు. ఈ దెబ్బకు జింబాబ్వే 2 ఓవర్లదాకా ‘పరుగే’ పెట్టలేదు. మళ్లీ తన మూడో ఓవర్లో (ఇన్నింగ్స్ 5వ) ఫ్లవర్ సోదరులు గ్రాంట్ (1), ఆండీ ఫ్లవర్ (0)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో వాస్ బ్రేక్ లేకుండా వరుసగా తన బౌలింగ్ స్పెల్‌ను కొనసాగించాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన లంక పేసర్ 11వ ఓవర్లో హ్యాట్రిక్ దెబ్బకొట్టి వికెట్లను డబుల్ చేసుకున్నాడు. వరుస బంతుల్లో కార్లయిజ్ (16), విషార్ట్ (6), తైబు (0)ల ఆట కట్టించాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీత్ స్ట్రీక్ (0)ను, మరుసటి ఓవర్లో ఎన్కల (1)ను వాస్ ఔట్ చేశాడు. అప్పుడున్న ఏకైక పవర్‌ప్లే (15 ఓవర్లు) ముగిసేసరికి జింబాబ్వే స్కోరు 37/8. ఆ ఎనిమిది వికెట్లు వాసే తీశాడు. 16వ ఓవర్ వేసిన మురళీధరన్ వరుస బంతుల్లో ఫ్రెండ్ (4)తో పాటు ఒలాంగ (0)ను ఔట్ చేయడంతో జింబాబ్వే 15.3 ఓవర్లలోనే 38 పరుగులకే ఆలౌటైంది. ఇది వన్డే చరిత్రలో అత్యల్ప స్కోరుగా పాకిస్తాన్ (43 ఆలౌట్) రికార్డును చెరిపేసింది. కోటా పూర్తయితే పదికి బాట పడేదేమో! ఇటు నుంచి చమిందా నిప్పులు చెరుగుతుంటే ఆట సాగేకొద్దీ ఆడే బ్యాట్స్‌మెన్ కరువయ్యాడు. అందుకే క్రీజ్‌లో నిలిచే సాహసం ఎవరు చేయలేకపోవడంతో అతని కోటా కూడా పూర్తి కాలేదు. ఒకవేళ 10 ఓవర్ల కోటా వేసి ఉంటే మాత్రం కచ్చితంగా పదికి పది వికెట్ల రికార్డు... కుంబ్లేలాగే వన్డేల్లో వాస్ పేరిట పదిలమయ్యేది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనను శ్రీలంక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 4.2 ఓవర్లలో 40/1 స్కోరుతో జయభేరి మోగించింది. ఇంకా 45.4 ఓవర్లు అంటే 274 బంతుల్ని మిగిల్చి అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే ఆడిన ఓవర్లు 15.4 కాగా... లంక ఎదుర్కొన్న 4.2 ఓవర్లు కలిపితే సరిగ్గా 20 ఓవర్లకే ఈ వన్డే ముగిసింది. అంటే ఈ తరం టి20లో సగం ఆటకే ముగిసిందన్నమాట! బంతుల (120) పరంగా వేగంగా ఫలితం వచ్చిన మ్యాచ్‌గా ఇది రికార్డు పుస్తకాల్లోకెక్కింది. 19 ఏళ్లపాటు ఈ రికార్డు నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న అమెరికా (12 ఓవర్లలో 35 ఆలౌట్) నేపాల్ (5.2 ఓవర్లలో 36/2) జట్ల మధ్య వన్డే మ్యాచ్ 104 బంతుల్లో ముగియడంతో శ్రీలంక–జింబాబ్వే జట్ల పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. -
'అందుకు మా స్పిన్నర్లే కారణం'
పల్లెకెలె:భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి రోజు శ్రీలంక ఫాస్ట్ బౌలర్లు విఫలమైనా, స్పిన్నర్లు ఆకట్టుకోవడం పట్ల ఆ జట్టు బౌలింగ్ కోచ్ చామిందా వాస్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ స్పిన్నర్ల ప్రదర్శన మెరుగ్గా ఉండటం వల్లే భారత జట్టు బ్యాటింగ్ ను కట్టడి చేయకలిగే అవకాశం దక్కిందన్నాడు. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్-కేఎల్ రాహుల్ లు తొలి వికెట్ కు 188 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆపై స్వల్ప విరామాల్లో భారత జట్టు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక స్పిన్నర్లు పుష్పకుమార, సండకన్ లు రాణించడంతో భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. దీనిపై చామిందా వాస్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ స్పిన్ బౌలర్లు ప్రదర్శనతో్ చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు ఆకట్టుకోలేకపోవడానికి వారికి అనుభవలేమే ప్రధాన కారణమన్నాడు. తమ జట్టులో ఉన్న పేసర్లకు పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్ లు అనుభవం లేదని, అందుచేత ఆరంభంలో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నాడు. క్రమేపీ వారు పుంజుకుని రాణించడం ఒక్కటే వారు ముందున్న లక్ష్యమన్నాడు.