ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ | ODI World Cup 2023: Pakistan Vs Afghanistan: Pakistan Win Toss, Opt To Bat First- Sakshi
Sakshi News home page

WC 2023: ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌

Published Mon, Oct 23 2023 1:44 PM | Last Updated on Mon, Oct 23 2023 2:51 PM

Pakistan vs Afghanistan WC 2023: Pakistan opt to bat  - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా చెన్నై వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే పాక్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలక​ం. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఒకే మార్పుతో బరిలోకి దిగింది.

ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ స్ధానంలో షాదాబ్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌ కూడా తమ జట్టులో ఒక మార్పు చేసింది. ఫారూఖీ స్ధానంలో స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు చోటు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం గమానర్హం.

తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌ కీపర్‌), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్

పాకిస్తాన్ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్‌ క్లాస్‌: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement