లాహోర్: అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశమైన పాక్‌తో శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరగాల్సిన వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకారం తెలిపారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సిరీస్ యధావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పేర్కొనడం సంచలనంగా మారింది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.
చదవండి: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రషీద్ ఖాన్ భావోద్వేగం
పాక్‌తో వన్డే సిరీస్‌కు తాలిబన్ల పచ్చజెండా: పాక్ క్రికెట్ బోర్డు
Published Thu, Aug 19 2021 9:22 PM | Last Updated on Mon, Sep 20 2021 12:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment