
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 228 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్..27 పరుగుల వద్ద ఉండగా గుల్బదిన్ నైబ్ (15) వికెట్‌ను నష్టపోయింది. ఆపై వెంటనే హస్మతుల్లా షాహిది గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో రహ్మత్ షా- ఇక్రమ్ అలీ ఖిల్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. వీరిద్దరూ 30 పరుగులు జత చేసిన తర్వాత రహ్మత్ షా(35) పెవిలియన్ చేరాడు. అటు తర్వాత అలీ ఖిల్- అస్గర్ అఫ్గన్‌లు మరమ్మత్తులు చేపట్టారు.
అస్గర్ దూకుడుగా ఆడటంతో అఫ్గాన్ స్కోరు పరుగులు పెట్టింది. అయితే అస్గర్(42; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నాల్గో వికెట్‌గా ఔట్ కావడంతో 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో అలీ ఖిల్(24) కూడా ఔట్ కావడంతో అఫ్గానిస్తాన్ 125 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాగా, నజీబుల్ల జద్రాన్(42; 54 బంతుల్లో 6 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో పాటు షిన్వారీ(19 నాటౌట్) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది చెలరేగి బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించిన షాహిన్.. తాజా మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఇమాద్ వసీం, వహాబ్ రియాజ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. షాదబ్ ఖాన్‌కు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment