
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు పాక్ సమాయత్తమైంది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. సర్ఫ్‌రాజ్ సేన ఆరు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి.. మూడు ఓడింది. వర్షం కారణం ఒక మ్యాచ్ రద్దుకావడంతో ఆ జట్టు 7 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. నాకౌట్‌కు చేరాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్‌లో తప్పక గెలవాలి. దీంతో అఫ్గాన్‌పై నెగ్గి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది.
గత రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో సర్ఫ్‌రాజ్ సేన బరిలోకి దిగనుంది. ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్‌తో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ టాపార్డర్‌పై భారీ అంచనాలున్నాయి. పేసర్లు ఆమిర్, షహీన్ షా అఫ్రీది, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. అఫ్ఘాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. భారత్‌పై పోరాటపటిమ చూపినా.. గత మ్యాచ్‌లో బంగ్లా చేతి లో చిత్తుగా ఓడింది. కనీసం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌లో బోణీ కొట్టాలని యోచిస్తోంది. దాంతో ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది.
తుది జట్లు
అఫ్గాన్
గుల్బదిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్ అఫ్గాన్, మహ్మద్ నబీ, సమిల్లాహ్ షిన్వారి, నజీబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్
పాకిస్తాన్
సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, హరీస్ సొహైల్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, వహాబ్ రియాజ్, మహ్మద్ అమిర్, షాహిన్ అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment