వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో 92 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్లా షఫీక్(58), ఇఫ్తికర్ అహ్మద్(40), షాదాబ్ ఖాన్(40) పరుగులతో రాణించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్ రెండు అజ్మతుల్లా, నబీ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment