వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఆఫ్గాన్ విజయంలో గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు. కాగా ఈ మెగా టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమానార్హం. ఇక ఆఫ్గాన్‌పై ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. తమ ఓటమికి కారణం బౌలర్ల వైఫల్యమనేని బాబర్ అన్నాడు.
"ఈ మ్యాచ్‌లో ఓటమి మాకు చాలా బాధ కలిగించింది. ముందు బ్యాటింగ్‌లో మంచి టార్గెట్‌ను సెట్ చేశాము. కానీ మా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు. మా స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావితం చేయలేదు. బ్యాటర్లపై ఏమాత్రం ఒత్తిడి తీసుకుని రాలేకపోయారు.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఏ ఒక్క విభాగంలో రాణించకపోయినా మ్యాచ్ ఓడిపోతాం. అది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అయినా కావచ్చు. ఈ రోజు ఫీల్డింగ్‌లో కూడా మేము మెరుగ్గా రాణించలేకపోయాం. మేము బౌండరీలు ఆపలేదు, అదనపు పరుగులు కూడా సమర్పించుకున్నాం.
అదే మా కొంపముంచింది. కానీ ఆఫ్గానిస్తాన్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆడింది. కాబట్టి క్రెడిట్ వారికే ఇవ్వాలనకుంటున్నాను. వారు మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. అందుకే విజయం సాధించారు. మా తదుపరి మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు.
చదవండి: ODI WC 2023 PAK Vs AFG: పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment