
హంబన్‌టోటా వేదికగా జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. షాదాబ్ ఖాన్, నసీం షా తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్హాక్ ఫారూఖీ మూడు వికెట్లతో అదరగొట్టాడు.
దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్ (151; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు.
ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించాడు. అనంతరం పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసి గెలిచింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హఖ్ (91; 4 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (48; 3 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (53; 6 ఫోర్లు) రాణించారు.
చదవండి: Praggnanandhaa: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
Comments
Please login to add a commentAdd a comment