అఫ్గాన్, పాక్ అభిమానుల చేష్టలతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆటను ఆస్వాదిస్తూ తమవాళ్లకు మద్దతుగా నిలవాల్సిందిపోయి.. వీధిరౌడిల్లా కొట్టుకోవడంతో ఆయా దేశాలకు తలవంపులు తెచ్చారని క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. స్థానిక మైదానంలో శనివారం అఫ్గాన్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని పాక్ 49.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, మ్యాచ్‌కు ముందు ఇరుదేశాల అభిమానుల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం అనంతరం కూడా కొనసాగింది.
మ్యాచ్ జరగుతున్న క్రమంలో రెండు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఉద్రిక్తతకు స్టేడియం వెలుపలనుంచి మ్యాచ్ చూస్తున్న మరికొంతమంది ఆజ్యం పోశారు. స్టేడియం ఆస్తులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవకు కారణమైన వారిని బయటికి పంపించి వేశారు. వరల్డ్‌కప్ మిగతా మ్యాచ్‌లు చూడకుండా ఐసీసీ వారిపై నిషేదం విధించింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ వృద్ధ అభిమానిపై అఫ్గాన్ మద్దతుదారు నోరుజారడంతో ఈ గొడవ జరినట్టు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్టేడియంలో గొడవ; ఛీకొట్టేలా ఉందీయవ్వారం..!
Published Sun, Jun 30 2019 1:17 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement