వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 8 వికెట్ల తేడాతో ఓడి ఘోర పరాభవం మూటకట్టుకున్న పాకిస్తాన్‌పై మాజీలతో పాటు అభిమానులు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చేరాడు.
ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వడం నిజంగా సిగ్గు చేటు అని అక్రమ్ మండి పడ్డాడు. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో ఆఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం ఇదే తొలి సారి. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచింది. అదే విధంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయి.
"ఆఫ్గానిస్తాన్ వంటి జట్టు చేతిలో ఓడిపోవడం చాలా అవమానకరం. 280 పరుగుల పైగా టార్గెట్‌ను కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించడమంటే సాధారణ విషయం కాదు. పిచ్ ఎలా ఉందన్న విషయం పక్కన పెట్టండి. పాక్ ఫీల్డింగ్ చూస్తే వీళ్ల ఫిట్‌నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. గత రెండేళ్లగా ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇదే విషయం మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ప్రస్తుత జట్టులో ఫిట్‌నెస్ లేని క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు. వారు రోజుకు 8 కేజీల చొప్పున మటన్ తింటున్నట్టు ఉంది.
ఆటగాళ్లకు కచ్చితంగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి. మీరు మీ ప్రోపిషన్ పరంగా దేశం కోసం ఆడుతున్నారు. మీరు మంచిగా ఆడేందుకే జీతం ఇస్తున్నారు. మిస్బా ఉల్ హక్ కోచ్‌గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించేవాడు. అతడికి అటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అతడు అన్ని విషయాల్లో కచ్చితంగా ఉంటాడు కాబట్టి పాక్ ఆటగాళ్లు అసహ్యించుకునేవారు. ఫిట్‌నెస్ అనేది జట్టుకు చాలా కీలకం. ఫిట్‌నెస్ ఉంటే ఫీల్డింగ్‌లో కూడా రాణించగలరు" అని ఏ1 స్పోర్ట్స్‌లో అక్రమ్ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: అఫ్గానిస్తాన్ సంచలనాల వెనుక ఇండియన్ లెజెండ్.. ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment