పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజం నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో బాబర్ తన వందో ఇన్నింగ్స్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 53 పరుగులతో అదరగొట్టిన ఆజం.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
బాబర్ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 5,142 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్ హసీం ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా తన వంద ఇన్నింగ్స్‌లలో 4946 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. బాబర్ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 18 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో బాబర్ తర్వాత స్ధానాల్లో వరుసగా ఆమ్లా(4946), వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(4607), విండీస్ కెప్టెన్(4436), ఇంగ్లండ్ స్టార్ జో రూట్(4428) కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీట్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి కూడా సాధ్యపడలేదు.
విరాట్ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 4230 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లి తొమ్మిదో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి.. ఆఫ్గానిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్‌ను పాక్ సొంతం చేసుకుంది.
చదవండి: #Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్ స్టార్ మృతి
Comments
Please login to add a commentAdd a comment