Mahnoor Baloch: Shah Rukh Khan Does not Know Acting - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుక్‌కు నటన రాదు, అంత అందగాడు కూడా కాదు.. రొమాంటిక్‌ పాత్రలకు కూడా సెట్టవడు

Published Sat, Jul 8 2023 9:13 PM | Last Updated on Sat, Jul 8 2023 9:23 PM

Mahnoor Baloch: Shah Rukh Khan Does not Know Acting - Sakshi

ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలకు అభిమానులు ఉంటారు. స్టార్‌ హీరో అంటే ఆ అభిమాన గణం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇందులో సాధారణ అభిమానులే కాదు వీరాభిమానులు కూడా ఉంటారు. కొందరు స్టార్స్‌కైతే దేశమంతా అభిమానులుంటారు. వారిలో షారుక్‌ ఖాన్‌ ముందు వరుసలో ఉంటాడు. నాలుగేళ్ల తర్వాత పఠాన్‌ సినిమాతో అభిమానులను పలకరించిన షారుక్‌ తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అభిమానులను అన్నేళ్లు వెయిట్‌ చేయించిన ఫలితంగా ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. జవాన్‌, డుంకీ, టైగర్‌ 3 అంటూ సినిమాల అప్‌డేట్లు ఇస్తూ పోతున్నాడు.

తాజాగా ఈ స్టార్‌ హీరోకు నటన రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మనూర్‌ బలోచ్‌. పాకిస్తాన్‌కు చెందిన నటి మనూర్‌ మాట్లాడుతూ.. 'షారుక్‌ ఖాన్‌ మంచి మనిషి. కానీ అతడు అంత అందగాడేమీ కాదు. అసలు ఆ జాబితాలోకే రాడు. తన వ్యక్తిత్తం, ఆత్మస్థైర్యం అతడికి అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. కొందరు అందంగా ఉన్నా సరే ముఖంలో ఆ కళ ఉండదు. అలాంటివారిని జనాలు అంతగా పట్టించుకోరు. ఇకపోతే షారుక్‌ ఖాన్‌కు నటన రాదని నా అభిప్రాయం. అతడొక గొప్ప బిజినెస్‌మెన్‌.

మార్కెట్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలనేదానిపై అతడికి పూర్తి పట్టు ఉంది. తనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ విషయంలో వాళ్లంతా కూడా నన్ను తప్పు పట్టవచ్చు. కానీ నావరకు మాత్రం అతడికి నటన తెలియదనే అనిపిస్తుంది. తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్‌ సృష్టించుకోవడం షారుక్‌కు బాగా తెలుసు. చాలామంది నటులకు అది రాదు. ఫలితంగా వాళ్లు ఇండస్ట్రీలో విజయాలను అలాగే కొనసాగించలేరు. షారుక్‌ రొమాంటిక్‌ పాత్రలకు సూట్‌ అవడు.

సైకో పాత్రలకే సరిగ్గా సరిపోతాడు' అని చెప్పుకొచ్చింది. బరూచా వ్యాఖ్యలపై షారుక్‌ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. 'లెజెండ్‌ను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు వాగుతోంది', 'షారుక్‌ను అడ్డుపెట్టుకుని పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తోంది', 'నీలా అతడు పక్కవాళ్ల గురించి ఏది పడితే అది వాగడు.. ఈ లెక్కన షారుక్‌ నీకంటే గొప్ప వ్యక్తే కదా' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మెహబూబ్‌ ఇంట పెళ్లి వేడుకలు, ఫోటోలు వైరల్‌
స్టార్‌ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement