Pakistani Actress Hania Aamir Dance To Naatu Naatu Song - Sakshi
Sakshi News home page

Naatu Naatu Song: పెళ్లి ఫంక్షన్‌లో నాటు సాంగ్‌కు వీరనాటు స్టెప్పులేసిన నటి

Published Fri, Feb 24 2023 4:31 PM | Last Updated on Sat, Feb 25 2023 3:15 PM

Pakistani Actress Hania Aamir Dance to Naatu Naatu Song - Sakshi

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'తోపాటు అందులోని పాటలు కూడా అభిమానులను ఓ ఊపు ఊపాయి. నాటు నాటు పాటకైతే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా వచ్చిపడింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ పాటకు స్టెప్పులేయడం కొంత కష్టమైనా సరే అందరూ దీనికి రీల్స్‌ చేస్తూ ఆ మధ్య తెగ హడావుడి చేశారు. తాజాగా ఈ పాటకు పాకిస్తాన్‌ ప్రముఖ నటి హనియా ఆమిర్‌ డ్యాన్స్‌ చేసింది. ఓ పెళ్లి ఫంక్షన్‌లో నాటునాటు హిందీ వర్షన్‌ నాచో నాచో సాంగ్‌కు ఓ రేంజ్‌లో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భలే ఎనర్జీతో స్టెప్పులేసిందని కామెంట్లు చేస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయానికి వస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమాకు హాలీవుడ్‌ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. కాగా ఈ సినిమా అమెరికాలో మార్చి 3న 200 థియేటర్లలో రీరిలీజ్‌ అవుతోంది.

చదవండి: సినిమా అంటే నానికి ఎంత ప్రేమో.. ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement