
కారు ప్రమాదంలో నటి సనాఖాన్ మృతి
కరాచీ: పాకిస్తాన్ నటి సనా ఖాన్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందింది. పాకిస్తాన్ లోని హైదరాబాదుకు ముప్పై కిలో మీటర్ల దూరంలో సూపర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. సనా ఖాన్ భర్త బాబర్ ఖాన్ కారు నడుపుతున్న సమయంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో సనా ఖాన్ కు , బాబర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సాయంతో అక్కడికి చేరుకున్నారు.
హుటాహుటినా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రికి చేరుకునే సరికే సనా ఖాన్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.