చంద్రయాన్‌ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ హీరోయిన్‌ | Pakistani Actress Sehar Shinwari Comment On Chandrayaan-3 Success - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ హీరోయిన్‌

Published Thu, Aug 24 2023 10:17 AM | Last Updated on Thu, Aug 24 2023 10:51 AM

Pakistani Actress Sehar Shinwari Comment On Chandrayaan 3 - Sakshi

చందమామపై మన విక్రమ్‌ కాలుమోపుతున్నప్పటి ఆ కొన్ని నిమిషాలు సస్పెన్స్‌ సినిమా క్లైమాక్స్‌ని తలదన్నేలా ఉత్కంఠ రేపాయి. ఒక హీరో సినిమాలో అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌ చేస్తుంటే విజిల్స్‌ వేయడం సహజం.. అలా బుధవారం సాయంత్రం కొన్ని కోట్ల మంది భారతీయులు కూడా విజిల్స్‌ వేశారు. అంతేకాకుండా వారందరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మన ఇస్రోని, శాస్త్రవేత్తల బృందం ఘనతని కొనియాడుతూ వారి ఆనందాన్ని మన సినీ తారలతో పాటు ప్రపంచం మొత్తం సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇందులో భాగంగా  పాకిస్తాన్‌కు చెందిన నటి హర్ షిన్వారీ చంద్రయాన్ -3 విజయం సాధించడంతో ఇస్రో శాస్త్రవేత్తలను  అభినందిస్తూ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా తన సొంత దేశం అయిన పాకిస్థాన్ పై తీవ్రమైన విమర్శలు చేసింది. భారత్‌తో శత్రుత్వాన్ని పక్కనపెడితే ఎవరైనా ఇస్రోను అభినందించాల్సిందేనని ఆమె తెలిపింది.

(ఇదీ చదవండి: చంద్రయాన్‌-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్‌)

పాకిస్తాన్, భారత్‌ మధ్య అన్ని కోణాల్లో అంతరం పెరిగింది. భారత్‌ను తాము అందుకోవాలంటే సుమారు 2,3 దశాబ్దాలు పట్టవచ్చని ఆమె అభిప్రాయ పడింది. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో భారత్‌ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి  పాకిస్తాన్ తలదించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. దురదృష్టవశాత్తు తమకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం పాకిస్తాన్ ప్రజలే అని తన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపింది. దీంతో పలువురు పాకిస్థానీయులు కూడా ఆమెకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement