
తిరువనంతపురం: కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో తీవ్రగాయాలపాలైన పైలట్, మరో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 20 అంబులెన్స్‌లు ఘటనాస్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి.
మరోవైపు ఎయిర్‌పోర్టులో కుండపోత వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాద సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానం ప్రయాణికులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment