కరోనా అన్నింటినీ మార్చేసింది. తినే తిండినీ, మనిషి నడతను, నడవడికను పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు గదుల్లో కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే పని చేస్తున్నారు. ఒక ఇంట్లోనే ఉన్నా కూడా ఒకరి మొహాలు మరొకరు చూసుకోవడమే గగనమైపోయిన నగరవాసులు ఇప్పుడు ఇంటిల్లిపాది కలిసి ముచ్చట్లాడుతూ భోజనం చేస్తున్నారు. ఇక ఈ సమయానికల్లా మొదలవాల్సిన పాఠశాలలు, కాలేజీలు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి. (‘యాపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్‌పాట్!)
ఈ నేపథ్యంలో నిద్రిస్తే లేపే స్నేహితుడు లేక, నిద్రను ఆపుకోలేక ఓ బుడ్డోడు జూమ్‌లో నిర్వహించిన క్లాసులోనే నిద్రపోయాడు. ఎంతలా అంటే కుర్చీనే పరుపుగా భావిస్తూ వెల్లకిలా పడుకుండిపోయాడు. అయితే అటువైపు టీచర్ మాత్రం 40 నిమిషాలు పాఠాలు చెప్తూనే ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారణం ప్రస్తుతం ఇది అందరి జీవనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. నిద్రను మించిన పని లేదంటూ అనేకమంది బెడ్డుకే పరిమితమవుతూ మరింత బద్ధకస్తులవుతున్నారు. 2020 మొత్తం ఇలాగే గడిచిపోయేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. (మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..)
Comments
Please login to add a commentAdd a comment