కోవిడ్ మహమ్మారి ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల పని విధానాన్ని మార్చేసింది. కార్యాలయాలు మూతపడటంతో కొన్ని రోజులపాటు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కంపెనీలు అమలు చేశాయి. తర్వాత క్రమంగా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి కంపెనీలు టాటా చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకగా.. మరికొన్ని కంపెనీలు కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్, కొన్ని రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్ అంటూ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే కొంత మంది ఉద్యోగులు మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అమెరికా, కెనడాలోని ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించబోమని ఇన్ఫోసిస్ వారికి తెలియజేసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ మోడ్‌లో పని చేయాలనుకుంటే ప్రత్యేక అనుమతి పొందాలని సూచించింది.
రాకపోతే క్రమశిక్షణా చర్యలు
నిబంధనలను అతిక్రమించి ఆఫీస్‌కు రాకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యూఎస్, కెనడాలో దేశాల్లో ఇన్ఫోసిస్‌కు 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే భారత్‌లోని ఉద్యోగులు ఆఫీస్‌కు రావడం ప్రస్తుతానికి తప్పనిసరి కాదు. ఇక్కడ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి ఇన్ఫోసిస్ నవంబర్‌లో మూడు దశల రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్‌ని ప్రకటించింది.
ప్రస్తుతానికి అమెరికా, కెనడా దేశాల్లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ మోడ్‌ను తప్పనిసరి చేసిన ఇన్ఫోసిస్ త్వరలో ఇక్కడ కూడా అమలు చేస్తుందని వర్క్ ఫ్రం హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment