ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాల్గొనాల్సి ఉండగా కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల పెరుగుదలతో పర్యటన రద్దయ్యింది. అప్పటి పర్యటన ఇప్పుడు ఖరారైంది. ఏప్రిల్ 26వ తేదీన భారత్‌కు ఆయన రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఎన్ని రోజుల పర్యటన.. ఎక్కడెక్కడ పర్యటిస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. జనవరిలో 26వ తేదీన పర్యటించాల్సిన బోరిస్ మళ్లీ ఈసారి ఏప్రిల్ 26వ తేదీన ఖరారైంది. దీంతో 26వ తేదీతో ఏదో ప్రత్యేకత ఉందని తెలుస్తోంది.
అయితే ఆ పర్యటనలో భాగంగా చెన్నెకు కూడా వెళ్తారని సమాచారం. ఈ మేరకు బ్రిటన్ అధికారులు చెన్నెలో పరిస్థితులు గమనిస్తున్నట్లు తెలుస్తోంది. బోరిస్ ప్రస్తుత పర్యటనతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు కొలిక్కి రానున్నాయి. భవిష్యత్‌లో బ్రిటన్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది.
బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం (సీపీటీపీపీ)లో చేరాలని భారత్‌కు అధికారికంగా అభ్యర్థన చేసింది. ఈ పర్యటనతో ఆ అంశాలపై ఒక స్పష్టత రానుంది.
అయితే శుక్రవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ కరోనా టీకా మొదటి డోస్ వేసుకున్నారు. ‘చాలా బాగుంది.. చాలా వేగవంతం’ అని లండన్‌లోని ఆస్పత్రిలో ఆస్ట్రాజెన్‌కా టీకా వేయించుకున్న అనంతరం బోరిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌పై 56 ఏళ్ల బోరిస్ నమ్మకం వెలిబుచ్చారు. ప్రతిఒక్కరూ టీకా పొందాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment