లండన్ : బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కానున్నారనే ఊహాగానాలపై ఆర్థిక మంత్రి రిషి సునక్ (40) స్పందించారు. తనకు అలాంటి కోరికేదీ లేదని కొట్టి పారేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో అలసిపోయి ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని కావాలనే కోరికేదీ తనకు లేదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి శుక్రవారం స్పష్టం చేశారు.
కరోనా కట్టడికి, ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొనే క్రమంలో రిషి చాలా విజయవంతంగా పనిచేశారని, ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ తరువాత, ఆ స్థానాన్ని భర్తీ చేయగల సామర్ధ్యం రిషికే ఉందన్న అంచనాలు ఈ మధ్య కాలంలో విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఒక రేడియో ఇంటర్య్వూలో రిషి ఈ వివరణ ఇచ్చారు. కరోనా మహమ్మారిపై పోరులో 24 గంటల పనిభారంతో అలసిపోయానని, తనకు కొంత విశ్రాంతి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో తన కుటుంబాన్ని, జిమ్ సెషన్లను మిస్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ వారాంతంలో విశ్రాంతి తీసుకొని, మరింత చురుకుగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment