Rishi Sunak.. బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతున్నది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ షాకింగ్.. రిషి సునాక్ ఓటమి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
పరోక్షంగా తాను రిషి సునాక్‌ను వ్యతిరేకిస్తున్న చెప్పకనే చెప్పారు. బోరిస్ జాన్సన్ శుక్రవారం ఓ సమావేశంలో ఎవరినైనా ఎన్నుకోండి.. రిషి సునాక్ తప్ప అని తన మద్దతు దారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, బోరిస్ జాన్సన్ బహిరంగంగా ఏ ఒక్కరి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం గానీ, బహిరంగంగా పోటీలో జోక్యం చేసుకోవడం లేదు. పోటీ నుంచి ఉద్వాసనకు గురైన అభ్యర్థులతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇవ్వాలని, రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిని కానివ్వవద్దని చెబుతున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. బోరిస్ జాన్సన్, ఆయన టీం మాత్రం రిషి సునాక్ తప్ప ఎవరైనా సరే స్లోగన్‌తో ఎన్నికల రహస్య క్యాంపెయిన్ చేపట్టినట్లు సమాచారం. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మొర్డాంట్ అభ్యర్థిత్వాల పట్ల బోరిస్ జాన్సన్ చాలా ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ రాజీనామా తర్వాతే.. ప్రధానిగా తాను(బోరిస్ జాన్సన్) వైదొలగాల్సి వచ్చినందునే సునాక్‌పై బోరిస్ ఇలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
Boris Johnson takes revenge on Rishi Sunak: The Times#UKPM #BorisJohnson #RishiSunak https://t.co/IA1m4aHAMv
— We For News (@WeForNews) July 16, 2022
ఇది కూడా చదవండి: రష్యాతో కలిసి పని చేస్తాం: నాసా సంచలనం.. ముందుగానే కౌంటర్ ఇచ్చిన పుతిన్
Comments
Please login to add a commentAdd a comment