ఉక్రెయిన్ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, పుతిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ ఒక వేళ అమ్మాయిగా పుట్టి ఉంటే.. యుద్ధం ఊసు ఉండేదే కాదని బోరిస్ పేర్కొన్నారు. ‘‘పుతిన్ ఒకవేళ అమ్మాయిగా పుట్టి ఉంటే.. యుద్దం ఉండేది కాదు. ఇంత మారణహోమం జరిగేది కాదు. కేవలం అభివృద్ధి..శాంతి గురించి ఆలోచన ఉండేది. విష పురుషత్వం అనేది ఆయనలో పూర్తిగా నిండిపోయిందనడానికి ఉక్రెయిన్ యుద్ధమే ఓ నిదర్శనం. కేవలం మగవాడనే అహంకారం.. తన మాచోయిజం చూపించుకోవడానికే ఆయన యుద్ధానికి దిగినట్లు కనిపిస్తోంది. కానీ, ఏం చేస్తాం ఆయనకు అమ్మాయిగా పుట్టే అవకాశమే లేకుండా పోయింద’’ని బోరిస్ వ్యాఖ్యలు చేశాడు.
అమ్మాయిలకు విద్య ఎంత అవసరమో చెబుతూ.. ప్రపంచ దేశాల్లో అధికారంలో మరింత మంది మహిళలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు, అప్పుడే శాంతి విరజిల్లుతుందని, అభివృద్ధి పథంలో దేశాలు నడుచుకుంటాయని ప్రకటించాడాయన. ఇక ఉక్రెయిన్ యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియదని, పుతిన్ ఎలాంటి శాంతి ఒప్పందాలకు ఆసక్తి చూపించడం లేదంటూ బోరిస్ కీలక వ్యాఖ్యలే చేశారు.
Comments
Please login to add a commentAdd a comment