లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ఎన్నికల నిధుల అక్రమ వినియోగ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు యూకే ఎన్నికల కమిషన్ బుధవారం వెల్లడించింది. ప్రధాని అధికారిక నివాసమైన 11 డౌనింగ్ స్ట్రీట్ పక్క వీధిలో ఉన్న బోరిస్‌కు చెందిన సొంత ప్లాట్‌కు పలు మరమ్మతులు చేపట్టారు. వీటిలో అధికార పార్టీకి చెందిన నిధులు ఉన్నాయన్నది ఎన్నికల కమిషన్ ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంపై తమ వద్ద ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్నికల కమిషన్ పేర్కొనడం విశేషం. ఇంటి నిర్మాణంలో ఎన్నికల నిధుల వ్యవహారాన్ని కనుగొనేందుకు విచారణ సాగుతోందని ఎన్నికల కమిషన్ చెప్పింది.
నిధుల అక్రమ వినియోగంపై బోరిస్‌కు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన డామినిక్ కమింగ్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. పార్టీ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్న వారి నుంచి ప్రధాని ఇంటి నిర్మాణానికి డబ్బు చేరేవేసే ప్రణాళికలు అప్పట్లో జరిగాయని ఆయన ఓ బ్లాగ్‌లో రాశారు. దీంతో బ్రిటన్‌లో ప్రతిపక్షం దీనిపై తీవ్రంగా మండిపడుతోంది. దీనిపై బోరిస్ వర్గం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై తాము పారదర్శకంగా ఉన్నామని, గతంలోనే ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్ ఎదుట వ్యక్తపరిచామని తెలిపింది.
చదవండి: కరోనాపై ప్రచారాల్లో వాస్తవమెంత.. డబ్ల్యూహెచ్‌ఓ ఏం చెబుతోంది?
Comments
Please login to add a commentAdd a comment