బ్రిటన్​ ప్రధాని​ రహస్య వివాహం! | UK PM Boris Johnson Secret Wedding Carrie Symonds | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో బోరిస్​ రహస్య వివాహం!

Published Sun, May 30 2021 11:53 AM | Last Updated on Sun, May 30 2021 11:53 AM

UK PM Boris Johnson Secret Wedding Carrie Symonds - Sakshi

లండన్​:  బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​​ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రియురాలు క్యారీ సైమండ్స్​తో శనివారం బోరిస్​ రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. లండన్​లో వెస్ట్​మినిస్టర్​ క్యాథెడ్రల్​లో ఆయన వివాహం చేసుకున్నారని ది సన్​, మెయిల్​ ఆన్​ సండేవర్క్​ లాంటి టాబ్లాయిడ్​లు ప్రముఖంగా ప్రచురించాయి. 

బోరిస్​-సైమండ్స్​ వివాహానికి సీనియర్ సభ్యులతో సహా ఎవరికీ ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. కేవలం కొద్దిమంది గెస్టుల మధ్య.. అది కూడా చివరి నిమిషంలో వాళ్లకు ఆహ్వానం ఇచ్చినట్లు ఆ పత్రికలు రాశాయి. ప్రస్తుతం కరోనా ఆంక్షలు కొనసాగుతుండడంతో 30 మందికి మాత్రమే వివాహ వేడుకలకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1గం.30ని సమయంలో వివాహం జరిగిందని, సైమండ్స్​ అరగంట ఆలస్యంగా వచ్చిందని ఆ కథనాలు వెల్లడించాయి. కాగా, బోరిస్ 2019లో ప్రధాని అయ్యాక డౌనింగ్​ స్ట్రీట్​లో తన గర్ల్​ఫ్రెండ్​ సైమండ్స్​(33)తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. పోయినేడాది ఎంగేజ్​మెంట్ చేసుకున్న ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. 

అయితే వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి జరగొచ్చని కొన్ని పత్రికలు కథనాలు రాసినప్పటికీ.. ఇప్పుడు హడావుడిగా పెళ్లి జరిగిందని అదే పత్రికలు మరోసారి కథనాలు రాశాయి. గతంలో బోరిస్(56)​ వివాహేతర సంబంధంతో కన్​జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. కాగా, బోరిస్​ జాన్సన్​కి ఇది మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. చివరిసారిగా మరీనా వీలర్​ అనే లాయర్​కి 2018లో విడాకులిచ్చారు. 

ఈమధ్యే బోరిస్​కు సలహాదారుడిగా పని చేసిన డొమినిక్​ కమింగ్స్.. ప్రధాని పదవికి బోరిస్​ అనర్హుడంటూ సంచలన కామెంట్స్​ చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్​ ప్రధాని పదవిలో ఉండి లార్డ్​ లివర్​పూల్​ 1822లో పెళ్లి చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement