అహ్మదాబాద్‌లో బోరిస్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన హోర్డింగ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వస్తున్నారు. ఇంగ్లండ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, వాణిజ్యంపై చర్చిస్తారు. శుక్రవారం ఉదయం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు.
తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రక్షణ, వాణిజ్య, ఆర్థిక, దౌత్యపరమైన అంశాల బలపేతం దిశగా చర్చిస్తారు. మధ్యాహ్నం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో కూడా జాన్సన్ చర్చిస్తారు. తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతరమైన నేపథ్యంలో జాన్సన్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment