లండన్ : కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యేందుకు డౌనింగ్ స్ర్టీట్ లోని ప్రధానమంత్రి కార్యాలయ్యానికి వచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత తిరిగి తన అధికారిక విధుల్లో బోరిస్ పాల్గొన్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో మార్చి 26 నుంచి స్వీయనిర్భంధంలోనే ఉన్న ఆయన ఇంటి నుంచే పనులు కొనసాగించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో లండన్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూడు రోజులపాటు ఐసీయూలోనే ఉన్నారు. ఏప్రిల్ 12న పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రధాని బోరిస్ నేరుగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు యూకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. (కరోనా : ఆస్పత్రి నుంచి బ్రిటన్ ప్రధాని డిశ్చార్జ్)
లండన్ పర్యావరణ కార్యదర్శి జార్జ్ యూస్టిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రస్తుతం కరోనా మరణాల రేటు తగ్గుతుందని, రాబోయే రోజుల్లో దీని సంఖ్య మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరం పాటించాలని అదే మన ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,52,000 కు పైగానే కోవిడ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ధాటికి దాదాపు 20,732 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment