UK Prime Minister Boris Johnson Wins Conservative Party Confidence Vote By 211 To 148 - Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. పదవి సేఫ్‌

Published Tue, Jun 7 2022 10:05 AM | Last Updated on Tue, Jun 7 2022 10:40 AM

UK PM Boris Johnson Survives Confidence Vote - Sakshi

బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా సొంత పార్టీ సభ్యుల నుంచే విశ్వాస తీర్మానం ఎదుర్కొన్న బోరిస్‌ జాన్సన్‌.. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు.

వివరాల ప్రకారం... కొద్ది నెలల క్రితం బ్రిటన్‌లో కోవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జ‌రిగాయి. కాగా, బ్రిటన్‌లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ పార్టీల‌కు ప్ర‌ధాని బోరిస్ హాజ‌రైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించాయి. దీనికి.. బోరిస్‌ సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు. 

ఇక, పార్టీ గేట్ వ్య‌వ‌హారంలో జాన్స‌న్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో భాగంగా బోరిస్‌కు మ‌ద్ద‌తుగా క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన 211 స‌భ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా 148 మంది స‌భ్యులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. ఈ విజ‌యం త‌న‌కు శుభ ప‌రిణామం అని పేర్కొన్నారు. 59 శాతం మంది స‌భ్యులు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇది నిర్ణ‌యాత్మ‌క‌మైన ఫ‌లితం అని తాను భావిస్తున్న‌ట్లు జాన్స‌న్ తెలిపారు. ఇక, 2019లో బోరిస్ జాన్స‌న్ భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement