confidence vote
-
Sakshi Cartoon: ...అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంలో పార్టీ అంటే..
...అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంలో పార్టీ అంటే బావుండదేమో సార్! -
హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా సొంత పార్టీ సభ్యుల నుంచే విశ్వాస తీర్మానం ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్.. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. వివరాల ప్రకారం... కొద్ది నెలల క్రితం బ్రిటన్‌లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరిగాయి. కాగా, బ్రిటన్‌లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆ పార్టీలకు ప్రధాని బోరిస్ హాజరైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి. దీనికి.. బోరిస్ సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు. ఇక, పార్టీ గేట్ వ్యవహారంలో జాన్సన్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో భాగంగా బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇది నిర్ణయాత్మకమైన ఫలితం అని తాను భావిస్తున్నట్లు జాన్సన్ తెలిపారు. ఇక, 2019లో బోరిస్ జాన్సన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. We need to come together as a party and focus on what this government is doing to help people with the cost of living, to clear the COVID backlogs and to make our streets safer. We will continue to unite, level up and strengthen our economy. pic.twitter.com/vIWK81dDJC — Boris Johnson (@BorisJohnson) June 6, 2022 -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు దిమ్మతిరిగే షాక్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే ముందుర.. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ పార్టీ) అధికార కూటమికి ఊహించని ఝలక్ ఎదురైంది. మూడు మిత్రపక్ష పార్టీలు, అదీ వెన్నంటి ఉంటాయనుకున్న పార్టీలు ఇమ్రాన్ ఖాన్‌కు హ్యాండిస్తూ ప్రకటన చేయడంతో పీటీఐలో వణుకు మొదలైంది. పాక్ అధికార పీఠాన్ని కదిలిస్తున్న రాజకీయాల్లో కీలక పరిణామం మరొకటి చోటు చేసుకుంది. పీటీఐ ప్రధాన భాగస్వామ పార్టీలు ఎంక్యూఎం-పీ, పీఎంఎల్-క్యూ, బీఏపీ లు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలతో ఇమ్రాన్ ఖాన్ (పాత చిత్రం) ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి ఆయా పార్టీలు సైతం బహిరంగ మద్దతును రేపో మాపో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి.. ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఈలోపే మిత్రపక్షాల నుంచి ఊహించని దెబ్బ తగిలింది. వాస్తవానికి మిత్రపక్షాలు అవిశ్వాసంలో ఇమ్రాన్ ఖాన్‌కు అండగా ఉంటామని నిన్నటి దాకా(మంగళవారం) ప్రకటిస్తూ వస్తాయి కూడా. ఇదిలా ఉండగా.. పాక్ నేషనల్ అసెంబ్లీలో(పార్లమెంట్) ప్రతిపక్షాలు మార్చి 8వ తేదీనే అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. అప్పటి నుంచి రాజకీయ సమీకరణాలన్నీ ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగానే మారుతున్నాయి. ఈ తరుణంలో ఖాన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నాడు. అధికారం నుంచి గద్దె దింపితే ప్రతిపక్షాలకు మరింత ప్రమాదమని తాజాగా ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు కూడా. pak no confidence motion ముంగిట.. తన మద్దతు స్థావరాన్ని సమీకరించడానికి మార్చి 27 న రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చాడు. అయితే ఆ ర్యాలీతో ఇమ్రాన్ ఖాన్ బలమేంటో స్పష్టంగా తేలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొత్తం 342 సభ్యులున్న పాక్ National Assemblyలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి 172 ఓట్లు రావాల్సి ఉంటుంది ఇమ్రాన్ ఖాన్‌కి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: ఆర్మీకి లంచం ఇచ్చి పదవి కాపాడుకోలేను- ఇమ్రాన్ ఖాన్ -
ఓటు విశ్వాసాన్ని కాపాడతాం
సాక్షి,కృష్ణా : సార్వత్రిక సంగ్రామం రసవత్తరంగా మారింది. తొలి విడత పోలింగ్ గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించాయి. మరో వైపు ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రంగం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తొలి సారిగా అధిక సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో హామీలు గుప్పించి మోసం చేసిన నేతలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. విలువలున్న నేతలనే ఎన్నుకుని ఓటుపై ఉన్న విశ్వాసం కాపాడతాం అని చెబుతున్నారు. ప్రతిఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించండి ఓటు వజ్రాయుధం. సమాజాన్ని మార్చే శక్తి ఓటుకే ఉంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నూరుశాతం ఓటింగ్ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మోసగించే నేతలను దూరంగా ఉంచాలి. నిజాయితీతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. –జంపాన శ్రీనివాసగౌడ్, సామాజిక కార్యకర్త దేశ పౌరులుగా మన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది దేశపౌరుల చేతిలో వజ్రాయుధం లాంటిది. నిజాయితీపరుడు, ప్రజలకు నిస్వార్థసేవలు చేస్తాడని విశ్వసనీయత కలిగిన వ్యక్తులను తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపడం ద్వారా విలువలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఓటుహక్కు వినియోగించుకోలేనివారు దేశపౌరులుగా ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు? తప్పనిసరిగా ఓటువేయాలి. –బచ్చు శేషగిరిరావు, నాగాయలంక ఓటును అమ్ముకోకండి... ఓటును అమ్ముకోవద్దని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశా. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును అమ్ముకోవటం సరైంది కాదు. ప్రజలు చైతన్య వంతులు కావాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఐదేళ్లపాటు ఉండే ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి. నిస్వార్థంగా సేవ చేసేవారినే ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వాలి. హామీలతో మోసం చేసేవారిని నమ్మవద్దు. – వైవీ మురళీకృష్ణ, సామాజిక కార్యకర్త, గుడివాడ మన భవిష్యత్ మన చేతుల్లో.. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి. రాజ్యాంగం మన పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించింది. దేశ ప్రగతిని మార్చే ఓటు అనే ఆయుధం మన చేతుల్లోనే ఉందని మరువకండి. ప్రజల అవసరాలను తీర్చే వారిని గుర్తించి వారికే ఓటు వేయండి. సాధారణంగా ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ఐదేళ్లు ప్రజలను పట్టించుకోరు. ఇప్పటి వరకు ఇదే రాజకీయాలను చూస్తున్నాం. మీ ప్రాంతంలో అలాంటివి జరిగితే ఇప్పుడు ఓటు కోసం వచ్చే వారిని నిలదీయండి. – బొప్పన విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సరియైన నిర్ణయం తీసుకోండి ఐదేళ్లకు పాలకులను ఎన్నుకుంటాం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్ అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలపై దాని ప్రభావం ఉంటుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. అందువలన ఓటు విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేకుండా ఇబ్బంది. ప్రసుత్తం ఎన్నికల రసవత్తరంగా ఉన్నాయి. మార్పు అవసరం. –వడ్లమన్నాటి ప్రసాద్, సింగరాయపాలెం నైతిక విలువలకు ప్రాధాన్యం విలువలతో రాజకీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. హామీల పేరుతో మోసగించే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఎన్నికల రాగానే మన చుట్టూ తిరుగుతున్న నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు పడతాం. మాట ఇచ్చిన తప్పని నేతలను ఎన్నుకోవాలి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. –విస్సంశెట్టి కోటేశ్వరరావు, పెదగొన్నూరు -
థెరెసా మేకు ఊరట
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకు స్వల్ప ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 19 ఓట్ల తేడాతో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఈ అవిశ్వాస పరీక్షను నెగ్గింది. అంతకు ముందు మంగళవారం ఈయూతో బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించిన సంగతి తెలిసిందే. వంద మందికి పైగా సొంత పార్టీకి చెందిన ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెగ్జిట్ ప్రక్రియ మరో రెండు నెలల గడువే ఉండటంతో.. అవిశ్వాస పరీక్ష నెగ్గిన మే వేగంగా స్పందించారు. మూడు పార్లమెంటు పనిదినాల్లో ప్రత్యామ్నాయ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరపడానికి ప్రతిపక్ష నేతలను థెరెసా మే ఆహ్వానించారు. బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. ఒకవేళ ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పళనికే పీఠం
► సీఎంగా రైతు బిడ్డ ► చిన్నమ్మ సేనల్లో సంబరాలు ► బెల్లం మండి నుంచి సీఎంగా.. ► నా కొడుకు ప్రజలు మెచ్చే పాలన అందిస్తాడు ► సీఎం పళనిస్వామి తల్లి ఆనందం బలపరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడపాడి కే పళనిస్వామికే సీఎం పీఠాన్ని అప్పగించారు. రైతు బిడ్డగా, బెల్లం మండితో బతుకు జీవన పయనంలో అడుగు పెట్టిన పళనిస్వామి సీఎంగా అవతరించడంతో స్వగ్రామం ఎడపాడిలో సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. తన కొడుకు ప్రజలు మెచ్చే పాలనను అందిస్తాడని పళనిస్వామి తల్లి తవసాయమ్మాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడుకు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా, బల నిరూపణలో మెజారిటీ నిరూపించుకున్న పళనిస్వామి జీవిత ఇతివృత్తాంతంలోకి వెళ్తే.. సాక్షి, చెన్నై : సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్ దంపతుల చిన్న కుమారుడు పళనిస్వామి(63). చదువు మీద మక్కువ ఎక్కువే. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాలుగు కిలో మీటర్లు రోజు నడక పయనం సాగించారు. ఇక, ఉన్నత చదువుగా ఈరోడ్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తన తండ్రి చూపిన మార్గంలో వ్యవసాయంతో పాటు బెల్లం మండితో జీవన పయనాన్ని సాగిం చారు. దాయాదుల సమరాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నించి, నెత్తిన కేసుల మోత వేసుకున్నారు. ఆధారాల కరువుతో ఆ కేసుల నుంచి బయట పడ్డారు. భార్య రాధా, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండిని ముందుకు తీసుకెళ్తూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు. తన పొలం పక్కనే అప్పటి మంత్రి ఈరోడ్ ముత్తు స్వామి పొలం ఉండడంతో ఆయన అడుగు జాడల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలుత శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సెంగోట్టయన్ మద్దతుదారుడిగా : ఎంజీయార్ మరణంతో ఆ పార్టీలోచోటు చేసుకున్న పరిణామాలు పళని స్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి. ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలక నేతగా ఉన్న సెంగోట్టయన్ తీవ్ర మద్దతు దారుడిగా అమ్మ జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్ వెన్నంటి నడిచారు. జయలలిత నమ్మిన బంటుల్లో ఒకరిగా రాష్ట్ర రాజకీయాలపై సెంగోట్టయన్ దృష్టి పెట్టగా, ఆయన మద్దతు సేలం జిల్లా రాజకీయాల్లో పళనిస్వామి చక్రం తిప్పారు. ఈ సమయంలో అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడం పళని స్వామికి మరింతగా కలిసి వచ్చింది. సెంగోట్టయన్ స్థానాన్ని భర్తీ చేసే రీతిలో అప్పట్లో చిన్నమ్మ శశికళ పావులు కదిపారన్న ప్రచారం ఉంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళని స్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం గమనార్హం. సంబరాల్లో చిన్నమ్మ సేన : బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. ఎక్కడికక్కడ బాణసంచా పేల్చుతూ , స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. పుదియ పురట్చి తలైవీ( నవ విప్లవ నాయకీ) చిన్నమ్మ , త్యాగ తలైవీ( త్యాగ నాయకీ) చిన్నమ్మ వర్ధిల్లాలన్న నినాదాన్ని మార్మోగించారు. చిన్నమ్మ శపథం నెరవేరిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రోడ్ల మీద ఆనంద తాండవం చేశారు. పళని స్వామి స్వగ్రామం ఎడపాడిలో అయితే, ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ తమిళనాడులోని (కొంగు మండలం) ధర్మపురి, కృష్ణగిరి, సేలం, నామక్కల్, తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూరుల్లో అయితే, చిన్నమ్మ వర్గీయుల్లో ఆనందం రెట్టింపు అయింది. కొంగు మండలానికి చెందిన రైతు బిడ్డ సీఎం కావడంతో తమ ప్రాంతాలకు మహర్ధశ పట్టినట్టే అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుపరి పాలన : తన కొడుగు బల పరీక్షలో నెగ్గడంతో పళని స్వామి తల్లి తవసాయమ్మాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంజీఆర్, జయలలిత చూసిన మార్గంలో ప్రజలకు మంచి పాలనను అందిస్తాడన్నారు. కష్టపడి పైకి వచ్చాడని, కష్టం అంటే ఏమిటో తెలిసిన వాడు కాబట్టి, ప్రజలు మెచ్చే విధంగా మంచి పనులు తప్పకుండా చేస్తాడని తెలిపారు. పళని పయనంలో కొన్ని ఘట్టాలు: ♦ 1989లో కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ♦ 1991లో అన్నాడిఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరో సారి గెలుపు. ♦ 1992 –1996 వరకు ఆవిన్ సంస్థ అధ్యక్షుడు. ♦ 1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ♦ 1998 లోక్ సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నిక ♦ 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి ♦ 1999–2004 వరకు తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ♦ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ♦ 2011లో అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలి సారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి. ఒకే నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళని స్వామి కాస్త ఎడపాడి కే పళని స్వామి అయ్యారు. ♦ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు ♦ 2017 ఫిబ్రవరి 14 అన్నాడిఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నిక ♦ 2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం. ♦ 2017 ఫిబ్రవరి 18 బల పరీక్షలో విజయ కేతనంతో సీఎం పీఠం పదిలం. -
విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో గట్టెక్కారు. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 140 ఓట్లు పడగా వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీ బలం 243 సీట్లు కాగా, పది ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 233 మంది సభ్యులు ఉన్నారు. తీర్మానం తొలుత మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే ప్రభుత్వం పట్టబట్టడంతో డివిజన్ ఓటింగ్ జరిపారు. మాజీ సీఎం జితన్‌రాం మాంఝీ మినహా మిగిలిన జేడీయూ అసమ్మతి ఎమ్మెల్యేలు అనర్హత భయంతో పార్టీ విప్‌కు కట్టుబడి సర్కారుకు మద్దతు పలికారు. ఏ పార్టీకీ చెందని ఎమ్మెల్యే అయిన తనకు విప్ ఎలా వర్తిస్తుందని మాంఝీ ప్రశ్నించి, సభ నుంచి వెళ్లిపోయారు. -
ముందే చేతులెత్తేసిన మాంఝీ
పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్షలో నెగ్గి తీరతానని నిన్నటి వరకు ధీమా వ్యక్తం చేసిన జితిన్ రాం మాంఝీ విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన శుక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. బీహార్ అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందే ఆయన ... గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీంతో జేడీయూ వర్గాలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాయి. రాజీనామా అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడారు. మరోవైపు నితీష్ కుమార్ కు మద్దతిస్తున్న జేడీయూ, ఆర్జేడీ, సీపీఐ సభ్యులు, ఒక స్వతంత్ర అభ్యర్తి స్పీకర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. ఓటింగ్ సమయంలో సభలోకి ప్రవేశిస్తారని జేడీయూ చీఫ్ విప్ శ్రవణ్ కుమార్ తెలిపారు. -
ముందే చేతులెత్తేసిన మాంఝీ
-
ఫడ్నవిస్ సర్కారుకు 12న తొలి సవాల్
ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో కొలువుదీరిన మైనారిటీ సర్కారు తొలి సవాల్ ఎదురుకానుంది. ఈ నెల 12న విశ్వాస పరీక్షను ప్రభుత్వం ఎదుర్కోనుంది. ఈ నెల 10 నుంచి 12 వరకూ జరగనున్న మూడు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బలం నిరూపించుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 సీట్ల సాధారణ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచింది. ఓ ఎమ్మెల్యే మృతితో ఆ పార్టీ బలం 121కి తగ్గింది. బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్ పక్షకు చెందిన ఏకైక ఎమ్మెల్యే మద్దతుతో కమలం పార్టీ బలం 122కి చేరింది.