ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో కొలువుదీరిన మైనారిటీ సర్కారు తొలి సవాల్ ఎదురుకానుంది. ఈ నెల 12న విశ్వాస పరీక్షను ప్రభుత్వం ఎదుర్కోనుంది. ఈ నెల 10 నుంచి 12 వరకూ జరగనున్న మూడు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బలం నిరూపించుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 సీట్ల సాధారణ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచింది. ఓ ఎమ్మెల్యే మృతితో ఆ పార్టీ బలం 121కి తగ్గింది. బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్ పక్షకు చెందిన ఏకైక ఎమ్మెల్యే మద్దతుతో కమలం పార్టీ బలం 122కి చేరింది.