
ముందే చేతులెత్తేసిన మాంఝీ
పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్షలో నెగ్గి తీరతానని నిన్నటి వరకు ధీమా వ్యక్తం చేసిన జితిన్ రాం మాంఝీ విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన శుక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. బీహార్ అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందే ఆయన ... గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీంతో జేడీయూ వర్గాలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాయి. రాజీనామా అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడారు.
మరోవైపు నితీష్ కుమార్ కు మద్దతిస్తున్న జేడీయూ, ఆర్జేడీ, సీపీఐ సభ్యులు, ఒక స్వతంత్ర అభ్యర్తి స్పీకర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. ఓటింగ్ సమయంలో సభలోకి ప్రవేశిస్తారని జేడీయూ చీఫ్ విప్ శ్రవణ్ కుమార్ తెలిపారు.