పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే ముందుర.. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ పార్టీ) అధికార కూటమికి ఊహించని ఝలక్ ఎదురైంది. మూడు మిత్రపక్ష పార్టీలు, అదీ వెన్నంటి ఉంటాయనుకున్న పార్టీలు ఇమ్రాన్ ఖాన్‌కు హ్యాండిస్తూ ప్రకటన చేయడంతో పీటీఐలో వణుకు మొదలైంది.
పాక్ అధికార పీఠాన్ని కదిలిస్తున్న రాజకీయాల్లో కీలక పరిణామం మరొకటి చోటు చేసుకుంది. పీటీఐ ప్రధాన భాగస్వామ పార్టీలు ఎంక్యూఎం-పీ, పీఎంఎల్-క్యూ, బీఏపీ లు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మిత్రపక్షాలతో ఇమ్రాన్ ఖాన్ (పాత చిత్రం)
ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి ఆయా పార్టీలు సైతం బహిరంగ మద్దతును రేపో మాపో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి.. ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఈలోపే మిత్రపక్షాల నుంచి ఊహించని దెబ్బ తగిలింది. వాస్తవానికి మిత్రపక్షాలు అవిశ్వాసంలో ఇమ్రాన్ ఖాన్‌కు అండగా ఉంటామని నిన్నటి దాకా(మంగళవారం) ప్రకటిస్తూ వస్తాయి కూడా.
ఇదిలా ఉండగా.. పాక్ నేషనల్ అసెంబ్లీలో(పార్లమెంట్) ప్రతిపక్షాలు మార్చి 8వ తేదీనే అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. అప్పటి నుంచి రాజకీయ సమీకరణాలన్నీ ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగానే మారుతున్నాయి. ఈ తరుణంలో ఖాన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నాడు. అధికారం నుంచి గద్దె దింపితే ప్రతిపక్షాలకు మరింత ప్రమాదమని తాజాగా ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు కూడా.
pak no confidence motion ముంగిట.. తన మద్దతు స్థావరాన్ని సమీకరించడానికి మార్చి 27 న రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చాడు. అయితే ఆ ర్యాలీతో ఇమ్రాన్ ఖాన్ బలమేంటో స్పష్టంగా తేలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొత్తం 342 సభ్యులున్న పాక్ National Assemblyలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి 172 ఓట్లు రావాల్సి ఉంటుంది ఇమ్రాన్ ఖాన్‌కి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
చదవండి: ఆర్మీకి లంచం ఇచ్చి పదవి కాపాడుకోలేను- ఇమ్రాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment