లండన్ : యుద్ధరంగంలో శత్రువులపై పోరాడిన బ్రిటన్‌కి చెందిన కెప్టెన్ టామ్ ముర్రే ఇప్పుడు వందేళ్ల వయసులో కనిపించని శత్రువుపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కరోనా మహమ్మారి బాధితులకు అండగా ఉండేందుకు, నేషనల్ హెల్త్ సర్వీసెస్‌కు విరాళాలు సేకరించాలని ధృఢంగా సంకల్పించారు. 100 ఏళ్ల వయసులో చక్రాల బండి సాయంతో బెడ్‌ఫోర్డ్‌శైర్‌లోని తన గార్డెన్లో నడక ప్రారంభించి దేశ ప్రజలందరినీ ఆకర్షించారు. నువ్వు ఒక్కడివి కాదు నీతోపాటూ మీమ్మున్నామంటూ, బ్రిటన్ పౌరులు టామ్ ముర్రేకు అండగా నిలవడంతో ఏకంగా 40 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించారు. కరోనాపై పోరులో ఇప్పటివరకు సేకరించిన విరాళాల్లో టామ్ రికార్డు సాధించారు. మిలిటరీలో ఉండగా తన పోరాటపటిమతో కెప్టెన్‌గా ఎదిగిన టామ్ ముర్రే, అనంతరం ఆయన చేసిన సేవలకుగానూ ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు గౌరవ కల్నల్ హోదాను ఇచ్చింది. ఇక, కరోనాపై పోరులో దేశ ప్రజలకు అండగా టామ్ ముర్రే చేస్తున్న పోరాటానికిగానూ, బ్రిటన్ ప్రదానం చేసే వ్యక్తిగత అత్యున్నత పురస్కారమైన నైట్‌హుడ్ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది.
టామ్ చూపిన దేశభక్తికి లండన్ పౌరుల దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు అందరూ ఆయన సేవలను కొనియాడారు. ‘టామ్ సేకరించిన నిధులు దేశవ్యాప్తంగా స్పూర్తినిచ్చింది. కరోనా క్లిష్టసమయంలో ఆయన ఒక వెలుగులా దారిచూపారు. ఆయన పోరాటపటి దేశం మొత్తాన్ని కదిలించింది. అందరి తరపున నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ కూడా టామ్ సేవలను కొనియాడుతూ నైట్‌హుడ్ పురస్కారానికి ఆమోదం తెలిపారు. (లాక్‌డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదు! )
బ్రిటన్‌లో కరోనా కారణంగా దాదాపు 35 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశానికి సహాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్న వారిని ఫ్రంట్ హీరోలుగా గుర్తిస్తూమంటూ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక టామ్ త్వరలోనే ప్రభుత్వం నుంచి నైట్‌హుడ్ పురస్కారాన్ని అందుకోనునన్నారు. ఆయన చేసిన సేవలకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. అందుకే గత నెలలో ఆయన పుట్టినరోజు సందర్భంగా 1,25,000కు పైగానే గ్రీటింగ్ కార్డులను అందుకున్నారు. వీటిని తెరవడానికి కొంత మంది వాలంటీర్లు సహాయం చేశారంటే టామ్‌పై అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచిన వారే నిజమైన హీరోలు అంటూ టామ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (మలేరియా మందు భేష్! )
Comments
Please login to add a commentAdd a comment