Body Shaper Fit Jacket: శరీరతత్వమో.. హార్మోన్‌ల అసమతుల్యమో, ప్రసవానంతరం వచ్చే సమస్యో.. ఇలా కారణం ఏదైనా చాలా మంది ఆడవాళ్లు వయసుతో సంబంధం లేకుండా స్థూలకాయంతో బాధపడుతుంటారు. శరీరంలో కొవ్వు పెరగడం వేరు.. కేవలం నడుము, పొట్ట భాగాల్లో కొవ్వు పేరుకోవడం వేరు. దాని వల్ల ముఖం ఎంత అందంగా ఉన్నా.. ఆకృతిపరంగా షేప్ లెస్‌గా కనిపిస్తుంటారు. దాంతో ఏ డ్రెస్ వేసుకున్నా ఒకేలా కనిపిస్తోంది.
పొట్టేమో ఫ్లాట్‌గా.. నడుము దగ్గర సన్నగా .. భుజాలు నిటారుగా ఉంటే ఆ ఆకృతే వేరు కదా! అలాంటి ఫిగర్‌ను సొంతం చేసే జాకెట్టే(బాడీ షేపర్) ఇది. శరీర ఆకృతిపై ప్రత్యేక శ్రద్ధ చూపించే స్త్రీలకు ఇదో మంచి బహుమతి. 30% స్పాండెక్స్, 70% నైలాన్‌తో రూపొందిన ఈ షేప్‌వేర్ బాడీసూట్ టాప్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ కావడంతో సులభంగా సాగుతుంది. మన్నుతుంది కూడా.
ప్రసవానంతర రికవరీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని జంప్ సూట్ మాదిరిగా వేసుకోవాలి. సౌకర్యవంతంగా ఉంటుంది. బాత్‌రూమ్‌కి వెళ్ళడానికి వీలుగా జిప్ ఉంటుంది. దాంతో వేసుకున్న డ్రెస్ పూర్తిగా తొలగించాల్సిన పనిలేదు. ఫిట్టింగ్ టాప్స్, స్కర్ట్స్, జీన్స్, పొట్ట భాగం కనిపించని మోడర్న్ వేర్ ఏది వేసుకున్నా దీన్ని చక్కగా ధరించొచ్చు.
ఇలాంటి మోడల్ జాకెట్స్ విషయంలో.. క్వాలిటీని బట్టి, అదనపు సౌలభ్యాలను బట్టి ధరలు మారుతుంటాయి. సాధారణమైన జాకెట్స్ వెయ్యి రూపాయాల్లోపు కూడా దొరుకుతాయి. ఈ జాకెట్స్‌తో బాడీని ఫిట్‌గా మార్చుకుంటే.. ఆకర్షణీయమైన రూపంతో పాటు ఆత్మవిశ్వాసమూ రెట్టింపవుతుంది.
చదవండి: పొటాటో పోషణ
Comments
Please login to add a commentAdd a comment