సాక్షి, హైదరాబాద్: మాయదారి కరోనా మనుషుల ఆరోగ్యాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడతారని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే... దీని బారినపడని వారూ పరోక్షంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఎయిమ్స్ ప్రొఫెసర్లు జరిపిన సర్వే వివరాలను ‘డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిన్డ్రోమ్ జర్నల్’ ప్రచురించింది. దీని ప్రకారం కరోనా, లాక్‌డౌన్ కారణంగా దేశానికి మధుమేహం, ఊబకాయం ముప్పు పొంచి ఉందని స్పష్టమవుతోంది. లాక్‌డౌన్ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం, తగిన వ్యాయామం చేయకపోవడం, మితం లేని ఆహారం తీసుకున్న కారణంగా 40 శాతం మంది బరువు పెరిగారని తేలింది. వీరిలో 7 శాతం మంది డయాబెటిస్ (షుగర్) వ్యాధి బారినపడే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ సర్వేను వయసు, లింగం, బరువు, కుటుంబ చరిత్ర, వ్యాయామ పద్ధతుల ఆధారంగా శాస్త్రీయంగా నిర్వహించినట్టు జర్నల్‌లో పేర్కొన్నారు.
జాగ్రత్త సుమా..
లాక్‌డౌన్ సమయంలో 38 శాతం మంది మాత్ర మే వారానికి మూడ్రోజుల పాటు 30–45 నిమిషాల సమయం వాకింగ్‌కు కేటాయించినట్టు చె ప్పారని సర్వే తెలిపింది. ఊబకాయం ఉన్న వారి కి కరోనా సోకితే మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని, వెంటిలేటర్ చికిత్స వరకు వెళ్లే అవకాశం ఉందని గతంలో జరిపి న అధ్యయనాలు వెల్లడించాయని, ఇప్పు డు లాక్‌డౌన్ కారణంగా బరువు పెరిగిన వారు కరోనా సోకకుండా జాగ్రత్త గా ఉండాలని సర్వే హెచ్చరించింది.
రక్త పరీక్షలు మేలు
30 ఏళ్లు దాటిన వారు రక్తంలో గ్లూకో జ్ పరీక్ష చేయించుకుంటే మేలని సర్వే సూచించింది. అసలు రక్త పరీక్షలు చేయించుకోని వారు, నియంత్రణలో లేని షుగర్ ఉన్నవా రు కరోనాకు గురయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది.
బరువు పెరిగారు..
లాక్‌డౌన్ సమయంలో వంద మంది నాన్ డయాబెటిక్ రోగులను పరిశీలించగా అందులో 40 శాతం మంది బరువు పెరిగారు. 41 శాతం మంది బరువులో ఎలాంటి మార్పు లేకపోగా, 19 శాతం మంది బరువు తగ్గారు. 0.1–5 కిలోల బరువు పెరిగినవారు 40 శాతం ఉంటే, ఏకంగా 16 శాతం మంది. 2.1–5 కిలోల బరువు పెరిగారు. ఇక, వీరిలో 7 శాతం మందికి డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని సర్వే వెల్లడించింది.
లక్షణాలు ఇప్పుడే కనిపించవు
బరువు పెరిగిన వారు డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. కనీసం 100లో 7% మందికి షుగర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వారికి ఆ లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో షు గర్ బారిన పడడం ఖాయం. – డాక్టర్ అనూప్ మిశ్రా, ఎయిమ్స్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment