ప్రతీకాత్మక చిత్రం
కరోనా వచ్చినప్పటి నుంచి లాక్‌డౌన్‌లు, వర్క్ ఫ్రం హోమ్‌లు మొదలయ్యాయి. బయట తిరగడం తగ్గిపోయింది. శరీరానికి అంతో ఇంతో ఎక్సర్‌సైజ్ ఆగిపోయింది. ఇది ఇలాగే ఓ ఐదేళ్లు కొనసాగితే ఏమవుతుందో తెలుసా?.. తెల్లగా పాలిపోయిన చర్మం నుంచి కోడిగుడ్డులాంటి షేప్‌లోని శరీరం వరకు చాలా మార్పులు జరుగుతాయట. ఓ ఫార్మా కంపెనీ, కొందరు డాక్టర్లు సర్వే చేసి ఈ అంచనాలు వేశారు. ఇప్పటికే అలాంటి పరిస్థితి మొదలైందనీ తేల్చేశారు. అసలు సమస్య ఏమిటో, ఎలా బయటపడాలో సూచించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్
ఇల్లు కదలక.. ఏడాదిన్నర
ఓ మహిళ ఉదాహరణగా..
లాక్‌డౌన్, వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు, ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఉండిపోవడం వంటివి లైఫ్‌స్టైల్, అలవాట్లలో గణనీయ మా ర్పులు తెచ్చాయి. శరీరానికి వ్యాయామం తగ్గింది. ఉద్యోగాలు, వ్యాపారాలపై ఆందోళన పెరిగింది. శరీరానికి సూర్యరశ్మి తగలడమే గగనమైపోయింది. భవిష్యత్తులో వీటిన్నింటి ప్రభా వం ఎంతగా ఉందన్న దానిపై లాయ్డ్ ఫార్మసీ సంస్థ అధ్యయనం చేయించింది. తమకు అనుబంధంగా పనిచేస్తున్న వైద్యుల వద్దకు వచ్చిన పేషెంట్లు, వారి ఆరోగ్య సమస్యలు, వాటికి కారణాలను విశ్లేషించి నివేదికను రూపొందించింది. ఓ మహిళను ఉదాహరణగా తీసుకుని, ఎలా మారిపోవచ్చో అంచనా వేసింది. ఎలాంటి మార్పులు రావొచ్చు, దానికి ఏమేం కారణం కావొచ్చన్నది వివరించింది. ఆ నివేదిక ప్రకారం..
వచ్చే సమస్యలు..
- సోఫాల్లో, బెడ్‌పై అడ్డదిడ్డంగా గంటలు గంటలు కూర్చోవడం పెరిగింది, నడక బాగా తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవాళ్లు గంటలకు గంటలు కదలకుండా కూర్చుండిపోతున్నారు. దీని వల్ల శరీర ఆకృతిలో మార్పు వస్తోంది. భుజాలు వంగిపోతున్నాయి (గూనితనం). బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. పొట్ట, వెనుకభాగం పెరిగి.. శరీరం కోడిగుడ్డు ఆకారంలోకి వచ్చేస్తోంది.
- శరీరానికి తగినంత సూర్యరశ్మి సోకక చర్మం పాలిపోవడం, శరీరానికి డి విటమిన్ అందక ఎముకలు, దంతా లు, కండరాలు బలహీనం కావడం, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది.
- ఇంటికే పరిమితమైన చాలా మంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతురులో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడటం పెరిగింది. వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు కోసమో.. సినిమాలు, సోషల్ మీడియా, ఇతర టైం పాస్ కోసమో కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ పైనో గడపుతున్నారు. దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది. నిద్రలేమికి దారితీస్తోంది.
- ఇంటికే పరిమితమైన చాలా మంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతురులో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడటం పెరిగింది. వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు కోసమో.. సినిమాలు, సోషల్ మీడియా, ఇతర టైం పాస్ కోసమో కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ పైనో గడపుతున్నారు. దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది. నిద్రలేమికి దారితీస్తోంది.
- ఉద్యోగం, వ్యాపారంలో దెబ్బతినవచ్చనే ఆందోళనకుతోడు ఇంతసేపూ ఇంట్లోనే ఉండటం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వెంట్రుకలు రాలిపోయే సమస్య బాగా పెరిగింది. ఒత్తిడి కారణంగా నిద్రలో పళ్లునూరడం వంటి సమస్యతో దంతాలు
- అరగడం, దెబ్బతినడం ఎక్కువైంది. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వల్ల
- నిద్రలేమి సమస్య పెరిగింది.
- శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల వ్యక్తుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోంది. ఆల్కాహాల్, సిగరెట్లు వంటి అలవాట్లు పెరగడం సమస్యను మరింతగా పెంచుతోంది.
డాక్టర్ల సలహాలు..
- వారంలో ఐదు రోజులు రోజూ కనీసం అరగంటకుపైగా కఠినమైన వ్యాయామాలు చేయాలి. మరో గంట పాటు ఇంటి ఆవరణలోనో, వీలున్న చోటనో వాకింగ్ చేయాలి. టీవీ చూస్తూనో, ఫోన్‌తో గడుపుతూనో ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటు మానుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చు ని ఉండకుండా.. మధ్యలో లేచి ఒకట్రెండు నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
- ఇంటి ఆవరణలోనో, డాబా మీదనో రోజూ పొద్దున పది, ఇరవై నిమిషాల పాటు చర్మానికి ఎండ తగిలేలా నిలబడాలి. అవసరమైతే వైద్యుల సూచనల మేరకు విటమిన్ డి మాత్రలు వేసుకోవాలి. కరోనా నుంచి కోలుకోవడానికి విటమిన్ డి చాలా తోడ్పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
- ఇంట్లో పగలంతా కూడా బయటి నుంచి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరం నుంచి టీవీ చూడాలి. ఫోన్, కంప్యూటర్లలో నైట్ మోడ్ ఆప్షన్ వాడుకోవాలి, బ్లూ లైట్ తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. వీలైతే యాంటీ గ్లేర్ అద్దాల వంటివి అమర్చుకోవాలి. ప్రతి పది, ఇరవై నిమిషాలకు ఒకసారి కాసేపు స్క్రీన్ నుంచి దృష్టి మరల్చి దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి సారించాలి.
- వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్ (కుంగుబాటు)కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త శారీరక శ్రమ, వ్యాయామం వంటివి మంచి నిద్రకు, మానసిక సమస్యల నియంత్రణకు
- తోడ్పడుతాయి. ఇష్టమైన వారితో మాట్లాడటం, సంగీతం వినడం, హాబీలు వంటివాటి వైపు మనసు మళ్లించుకోవాలి.
- వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్ (కుంగుబాటు)కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త శారీరక శ్రమ, వ్యాయామం వంటివి మంచి నిద్రకు, మానసిక సమస్యల నియంత్రణకు
- తోడ్పడుతాయి. ఇష్టమైన వారితో మాట్లాడటం, సంగీతం వినడం, హాబీలు వంటివాటి వైపు మనసు మళ్లించుకోవాలి.
- తగినంతగా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, భాగస్వాముల తోడ్పాటు ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఆల్కాహాల్, సిగరెట్లు మానేయడం మంచిది.
గుర్తించి, మార్చుకోవాల్సింది మనమే..
ఈ సమస్యలన్నీ వింటే.. వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు, ఇంట్లోనే గడపడం మంచిది కాదా అన్న సందేహాలు వస్తాయి. అయితే లాక్‌డౌన్ వల్ల వచ్చిన మార్పులను.. తిరిగి లాక్‌డౌన్‌కు ఇచ్చేయాలని, లైఫ్‌స్టైల్ మార్పులను నియంత్రణలో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ల కారణంగా మనుషుల ప్రవర్తన, అలవాట్లలో చాలా పెద్ద మార్పు లు వచ్చాయి. మనుషుల్లో శారీరకంగా జడత్వం పెరిగింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడం వల్ల.. ఈ అలవాట్లు, ప్రవర్తన ఇలాగే ఎప్పటికీ ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ అలవాట్లు, ప్రవర్తన మంచివి కాదని గుర్తించి, సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు..’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కేరన్ సేయన్ స్పష్టం చేశారు.
ఆఫీస్ తరహా సెటప్ ఉంటే బెటర్
వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు, ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న వారు అలాగే కూర్చుని ఉండిపోకుండా.. మధ్యలో బ్రేక్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోఫా, బెడ్ మీద కూర్చుని పనిచేయడం, క్లాసులు వినడం వంటివి చేయొద్దని.. ఆఫీసు/కాలేజీ తరహాలో కుర్చీ, టేబుల్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment