16 ఏళ్లు.. 160 కేజీలు.! | young man struggles with heavy weight | Sakshi
Sakshi News home page

16 ఏళ్లు.. 160 కేజీలు.!

Published Thu, Nov 9 2017 5:48 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

young man struggles with heavy weight - Sakshi

సాక్షి, విజయనగరం: పుట్టినపుడు బొద్దుగా ఉన్న కొడుకు చూసి మురిసిపోయింది ఆ తల్లి. ఐదేళ్ల వయసు వచ్చేసరికి కాస్త లావుగా ఉంటే పుష్టిగా ఉన్నాడనుకుంది. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా 160 కేజీలయ్యాడు. ప్రస్తుతం ఆతల్లి ఇదేదో కొంపముంచేలా ఉందని తల్లడిపోతోంది. తన కొడుకును కాపాడాలని అందరినీ వేడుకుంటోంది. 

వివరాల్లోకి వెళితే.. విజయనగరంకు చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కుమారుడు పవన్‌ పుట్టినప్పటి నుంచి బొద్దుగా ఉండేవాడు. కాలక్రమేనా పవన్‌ బరువు పెరుగుతున్నాడు. దీంతో రాజేశ్వరి వైద్యులకు చూపించడంతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. తన భర్త ఐదేళ్ల కింద స్థూలకాయం కారణంగా గుండెపోటుతో చనిపోయాడు. ప్రస్తుతం పవన్‌ వయసు 16 ఏళ్లు. బరువు ఏకంగా 160 కిలోలు. భారీ కాయంతో పవన్‌ కుర్చొలేక, నిలబడలేక పోతున్నాడు. ఇప్పుడు వైద్యం కోసం తీసుకెళ్తే ‘మోర్‌ బిడ్‌ ఒబిసిటీ’తో బాధపడుతున్నాడని, వెంటనే గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. దీంతో హైదరాబాద్‌లోని నిజాం ఆసుపత్రికి సంప్రదిస్తే రూ. 2.50 లక్షలు ఖర్చు అవుతుందని, ఆర్థిక సాయం అందించి నా బిడ్డని కాపాడండి అంటూ రాజేశ్వరి అందరినీ వేడుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement