వన్డే క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూనగా చెప్పుకునే ఆఫ్ఘనిస్తాన్ పటిష్ట జట్టు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం.
ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు నమోదు చేసినట్లైంది. ఈ విజయాలన్ని కూడా గత ఏడాదికాలంలోనే సాధించనవి కావడం విశేషం. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతాలు (2023 వన్డే వరల్డ్‌కప్‌లో సంచలన విజయాలు, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్) చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఒక్క భారత్ మినహా అన్ని ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై విజయాలు సాధించింది.
THE WINNING MOMENT FOR AFGHANISTAN VS SOUTH AFRICA. 🇦🇫
- What a time for Afghan cricket, they're one of the best currently! 💯pic.twitter.com/SZ8LIplppT— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు షార్జా వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.
ఫజల్ హక్ ఫారూకీ 4, ఘజన్‌ఫర్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు (వియాన్ ముల్దర్ (52), ఫోర్టుయిన్ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్ (10)) చేయగలిగారు. వియాన్ ముల్దర్ అర్ద సెంచరీతో ఆదుకోకపోయి ఉంటే సౌతాఫ్రికా స్కోర్ కూడా రెండంకెలకే పరిమితమయ్యేది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఆ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆదిలో తడబడినప్పటికీ.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (25), గుల్బదిన్ నైబ్ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 2, ఎంగిడి, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది.
చదవండి: వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు.. ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment