
నేడు ఆస్ట్రేలియాతో అఫ్గానిస్తాన్ ‘ఢీ’
గెలిచిన జట్టు దర్జాగా సెమీస్‌కు
వర్షంతో మ్యాచ్ రద్దయితే అఫ్గాన్ ఖేల్‌ఖతం
ఓడిపోతే ఆసీస్‌కు ఇంగ్లండ్ గతే!
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, అఫ్తానిస్తాన్‌ల మ్యాచ్ ఫలితం మొత్తం గ్రూప్ ‘బి’ సమీకరణాలనే మార్చేసింది. నాలుగు జట్లలో ఒక్క ఇంగ్లండ్ తప్ప దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ఈ రోజు నాకౌట్ దశ బెర్త్ కోసం ఆసీస్, అఫ్గాన్‌లు కాచుకున్నట్లే ఆసక్తికరంగా మ్యాచ్‌ను ఆపేందుకు వర్షం కూడా కాచుకుంది. శుక్రవారం వానముప్పు ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవేళ మ్యాచ్‌ను ముంచేసే వాన కురిస్తే మాత్రం అఫ్గానిస్తాన్ కథ ఇక్కడితోనే ముగుస్తుంది.
4 పాయింట్లతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో మిగిలున్న మ్యాచ్‌తో సంబంధం లేకుండా దక్షిణాఫ్రికా (ప్రస్తుతం 3 పాయింట్లు) సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తాజా పోరు విషయానికొస్తే ఆ్రస్టేలియాను ఓడించడం అఫ్గాన్‌కు అంత సులువైతే కాదు. కానీ ఇది క్రికెట్. స్థిరమైన ఫలితాలేవీ ఉండవు. మేటి జట్టా, గట్టి ప్రత్యర్థా... అనేవి, గత గణాంకాలు పనికిరావు. శుక్రవారం ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టే గెలుస్తుంది.
అఫ్గాన్ ఈ టోర్నీలో సంచలనానికి సీక్వెల్ చూపిస్తే మాత్రం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం, ఇతర ఏ సమీకరణంతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్ చేరుతుంది. ఆసీస్ మాత్రం దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం కోసం నిరీక్షించక తప్పదు. ఆ్రస్టేలియా కంటే దక్షిణాఫ్రికా రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో సఫారీ జట్టు ఓడిపోయినా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇరు జట్లకు తెలిసిన పిచ్‌పై...
లాహోర్‌పై ఇటు అఫ్గాన్‌కు, అటు ఆసీస్‌కు అవగాహన ఉంది. ఇరు జట్లు కూడా తమ బ్యాటింగ్ సత్తాతోనే తమ తమ మ్యాచ్‌ల్లో గెలిచాయి. కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకున్నాయి. దీంతో సహజంగా టాస్ కీలకపాత్ర పోషించే అవకాశముంది. ఏ రకంగా చూసిన మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా గట్టి ప్రత్యర్థి. కానీ అజేయమైన ప్రత్యర్థి కాదు. ఈ ‘చాంపియన్స్’ చరిత్రలో 2009 తర్వాత మొన్న ఇంగ్లండ్‌పై మాత్రమే గెలిచిన కంగారూ జట్టు మధ్యలో జరిగిన రెండు టోర్నీల్లో ఓటమి లేదంటే రద్దు ఫలితాలతో నిరాశపరిచింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా బౌలింగ్ దళం చాలా బలహీనంగా ఉంది. పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌ల లోటు కనిపిస్తోంది. బౌలింగ్ విషయంలో అఫ్గాన్ కాస్త మెరుగే అయినా... స్మిత్, లబుõÙన్, హెడ్, ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్‌లాంటి బ్యాటింగ్ లైనప్‌ను ఢీకొంటుందా అనే సందేహం కూడా ఉంది.
పిచ్, వాతావరణం
లాహోర్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్. ఆస్ట్రేలియా–ఇంగ్లండ్... అఫ్గాన్–ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగుసార్లు 300 పైచిలుకు స్కోరు సులువైంది. దీంతో మరో భారీస్కోరు ఆశించవచ్చు. ఇదే జరిగితే బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ భారీ వర్షసూచన కూడా ఉంది.
4 ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడింది. నాలుగింటిలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది.
తుది జట్లు
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), షార్ట్, హెడ్, లబుషేన్, జోస్ ఇన్‌గ్లిస్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా, జాన్సన్.
అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్ ), గుర్బాజ్, ఇబ్రహీమ్ జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్.
Comments
Please login to add a commentAdd a comment