హైదరాబాద్‌ సేఫ్‌ | hyderabad is earth quake safe zone | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సేఫ్‌

Published Sun, Sep 25 2016 8:38 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

హైదరాబాద్‌ సేఫ్‌ - Sakshi

హైదరాబాద్‌ సేఫ్‌

హైదరాబాద్‌(రాయదుర్గం): హైదరాబాద్‌కు భూకంప భయం లేదని, సిటీ సేఫ్‌జోన్‌లో ఉందని ఎంజీఆర్‌ఐ అబ్జర్వేటరీ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ డి. శ్రీనగేష్‌ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీలో ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఈఈఆర్‌సి) ఆధ్వర్యంలో ‘ఎర్త్‌క్వేక్‌ రెసిస్టెంట్‌ డిజైన్ ఆఫ్‌ స్ర్టక్చర్స్‌’ అనే అంశంపై ఒక రోజు సదస్సును శనివారం నిర్వహించారు.

ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్‌ డి శ్రీనగేష్‌ మాట్లాడుతూ భారతదేశంలో 60 శాతం భూభాగం భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారన్నారు.హైదరాబాద్‌ నగరం మాత్రం సేఫ్‌ జోన్లో ఉందని ఆయనతెలిపారు. ట్రిపుల్‌ఐటీ ఈఈఆర్‌సీ హెడ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ ప్రదీప్‌కుమార్, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ రూపేన్ గోస్వామి, ట్రిపుల్‌ఐటీ ఈఈఆర్‌సీ ప్రొఫెసర్‌ సుప్రియా మహంతి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement