భూకంపంతో దెబ్బతిన్న ఇంట్లోంచి వస్తున్న మంటల్ని ఆర్పుతున్న సిబ్బంది
లాస్‌ఏంజెల్స్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. లాస్ ఏంజెల్స్‌లో భూకంపం కారణంగా భవనాలు కంపించా యని, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వాటిల్లాయని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల సంబంధమైన నష్టం అంతగా సంభవించలేదని లాస్ ఏంజెల్స్ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దక్షిణ కాలిఫోర్నియాలో గత రెండు దశాబ్దాల్లో ఇదే అతి పెద్ద భూకంపమని లాస్ ఏంజెల్స్ టైమ్స్ తెలిపింది.
జనం ఇళ్లను వదిలిపెట్టారని, ఇళ్ల పునాదులు పగుళ్లిచ్చాయని, అడ్డగోడలు కుంగిపోయాయని శాన్ బెర్నార్డినో ఫైర్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. లాస్ ఏంజెల్స్‌కు 240 కిలోమీటర్ల దూరంలోని రిడ్జ్‌క్రెస్ట్ అనే చిన్న నగరం ఈ భూకంపం కారణంగా భయంతో వణికిపోయింది. అసలు తాము బతుకుతామనుకోలేదని, భవనం కప్పు కూలి తనపై అక్కడున్న అతిథులపై పడిందని ఆ నగరంలో సూపర్ 8 అనే హోటల్ నడుపుతున్న భారత సంతతికి చెందిన పింకీ పాంచల్ సీఎన్‌ఎన్‌కి తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment