
టోక్యో: జపాన్‌లోని హొక్కైడో ద్వీపాన్ని భూకంపం వణికించింది. స్థానికకాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రిక్టర్‌స్కేలుపై 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఈశాన్య జపాన్‌లో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. అలాగే అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీచేయలేదు.జేబీ టైఫూన్ జపాన్‌ను అతలాకుతలం చేసిన కొన్నిగంటల్లోనే భారీ భూకంపం వణికించడం గమనార్హం.
గంటకు 216 కి.మీ.ల వేగంతో దూసుకొస్తున్న ‘జెబీ’ తుపాను గాలుల ధాటికి కొట్టుకొచ్చి కుప్పగా పడిన కార్లు. బుధవారం పశ్చిమ జపాన్‌లోని కోబె నగరంలో తీసిందీ ఫొటో.
Comments
Please login to add a commentAdd a comment