
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలు అసోం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. భూకంపం కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కామెంగ్ జిల్లాలో కేంద్రీకృతమైందని ప్రముఖ సెస్మాలజిస్ట్ వివరించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సాధారణంగా రిక్టర్ స్కేల్ సూచి 6 దాటితే తీవ్రమైన దుర్బిక్ష్యం సంభవిస్తుందన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment