ఆ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: జూనియర్ ఎన్టీఆర్ | Jr NTR Tweet On Japan Earthquakes On New Year Day | Sakshi
Sakshi News home page

Jr Ntr : వారం రోజులుగా అక్కడే ఉన్నా: జూనియర్ ఎన్టీఆర్

Published Tue, Jan 2 2024 7:31 AM | Last Updated on Tue, Jan 2 2024 10:11 AM

Jr Ntr Tweet On Japan Earth Quakes On New Year Day - Sakshi

జపాన్‌లో భూకంపం రావడంపై జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత వారం రోజులుగా అక్కడే ఉన్నానని ఆయన తెలిపారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జపాన్ ప్రజల  ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. 

ఎన్టీఆర్ తన ట్విటర్‌లో రాస్తూ..'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా.  ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల  ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రంలో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement