
అనంతపురం జిల్లాలో భూప్రకంపనలు..
అనంతపురం: అనంతపురం జిల్లా బెళుగుప‍్ప మండలం జీడిపల్లిలో మంగళవారం ఉదయం పెద‍్ద శబ‍్దంతో భూమి కంపించిది. భూమిలో భారీ శబ‍్దంతో పాటు భూమి కంపించడంతో గ్రామస్తులు భయాందోళనతో ఇళ‍్లలోంచి సమీప పొలాల‍్లోకి పరుగులు తీశారు.
భూ ప్రకంపనల తీవ్రతకు సీసీరోడ్డుతో పాటు మరికొన్ని రోడ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. సుమారు తొమ్మిది సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి ఇలా కంపించడం సంవత‍్సర కాలంలో ఇది రెండవసారని గ్రామస్థులు చెబుతున్నారు.