కిన్మేమై బియ్యం గురించి విన్నారా? ధర తెలిస్తే కంగుతింటారు! | What Is Kinmemai Rice? World's Most Expensive Grain | Sakshi
Sakshi News home page

కిన్మేమై బియ్యం గురించి విన్నారా? ధర తెలిస్తే కంగుతింటారు!

Published Thu, Sep 19 2024 4:15 PM | Last Updated on Thu, Sep 19 2024 4:29 PM

What Is Kinmemai Rice? World's Most Expensive Grain

మనం చూసే సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి జపాన్‌కి చెందిన కిన్మేమై బియ్యం. అయితే దీన్ని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. జపాన్‌ వాళ్లు ఈ బియ్యాన్నితాము పేటెంట్‌ పొందిన ‍ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలోనే అభివృద్ది చేశారు. ముఖ్యంగా ఆహార ప్రియలుకు మంచి పోషాకాలను అందించే దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం. అయితే ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు. 

అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించొచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్‌నెస్‌గా ఉంటాయి. చూసేందుకు కూడా చాలా వెన్న మాదిరి సున్నితంగా ఉంటుంది. పోషకాల పరంగా సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు బ్రౌన్‌ రైస్‌ మాదిరి ప్రయోజనాలకు కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్‌నట్‌ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్‌ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఇవి తెలుపు, గోధుమ వంటి రెండు రకాల్లోనూ లభ్యమవుతాయి. ఇందులో ఊక ఉంటుంది.

  • సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఫైబర్‌, ఏడు రెట్టు విటమిన్‌ బీ1 కలిగి ఉంది. 

  • ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదర్కొనడంలో సహాయపడుతుంది. 

  • ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్‌లు(ఎల్‌పీఎస్‌)ను కలిగి ఉంది. 

  • ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు, కేన్సర్‌, డిమెన్షియా(చిత్త వైకల్యం) వంటి వ్యాధులతో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థకు సహజమైన బూస్టర్‌.

  • కడుపు ఉబ్బరం, అజీర్ణం తదితర సమస్యలకు చెక్‌ పెడుతుంది. 

అలాగే అన్నం అధిక నీటిని పీల్చుకోకుండా చేస్తుంది కాబట్టి ఇది బ్రౌన్‌ రైస్‌కి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందింగలదని చెబతున్నారు నిపుణులు. 

ధర..
మార్కెట్‌లో ఈ బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ధరల పరంగా అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. అయితే జపాన్‌లో ఈ బియ్యాన్ని ఒక పెట్టేలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్‌ చేసి విక్రయిస్తుంటారు. దీని ధర రూ. 13000/-

కిన్మెమై రైస్‌ని టోయో రైస్ కార్పొరేషన్ రూపొందించింది. ఈ రైస్‌ కార్పొరేషన్‌ వాకయామాలో 1961 స్థాపించబడింది. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్పొరేషన్‌ సాంకేతికలో మెరుగుదల ఈ కిన్మెమై రైస్‌ అభివృద్ధికి దారితీసిందని జపాన్‌ అగ్రికల్చర్‌ నిపుణులు చెబుతున్నారు.

(చదవండి: టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో టెస్టోస్టెరాన్‌ థెరపీ! మహిళలకు మంచిదేనా..?)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement